Manchu Vishnu : మంచు విష్ణు అసలు టార్గెట్‌ వేరే..? ఇది శాంపిల్‌ మాత్రమే..?

October 11, 2021 10:28 PM

Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు, ప్రకాష్ రాజు ప్యానెల్ ల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. పరస్పర మాటల యుద్ధం తర్వాత మా ఎన్నికలు ఎంతో రసవత్తరంగా కొనసాగి చివరికి మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు ప్రత్యర్థులపై గట్టి పోటీగా నిలబడి ప్రెస్ మీట్ పెట్టి వారికి సరైన సమాధానం చెబుతూ ఎన్నికలలో తన హవా కొనసాగించారు.

Manchu Vishnu has his own real target maa elections are just sample

ఇలా మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న తర్వాత తన ప్లాన్ ఏమిటి అనే విషయానికి వస్తే.. మంచు విష్ణు రాజకీయాలలోకి రావాలనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. మోహన్ బాబు కోరిక మేరకు తన వారసులు రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావించేవారు. ఇక విష్ణు తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తాడని మా ఎన్నికలు స్పష్టం చేశాయి.

ఇక విష్ణు భార్య స్వయానా సీఎం వైఎస్ జగన్ కు కజిన్ సిస్టర్ కావడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా విష్ణుకు ఎంతో సులభతరం అవుతుందని పలువురు భావిస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ప్రత్యర్థులకు ఏ విధమైనటువంటి పోటీ ఇవ్వాలో మా ఎన్నికల ద్వారా విష్ణు తెలుసుకున్నారు. ఇక విష్ణు, జగన్ పలు సందర్భాలలో కలిసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ అవకాశాలను ఉపయోగించుకొని విష్ణు రాజకీయాల్లోకి వస్తారని భావిస్తున్నారు. మరి మోహన్ బాబు కోరికను విష్ణు నెరవేరుస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now