Shriya Saran : సీక్రెట్‌గా ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన శ్రియ‌.. ఈ విష‌యం తెలిసి అంతా షాక్‌..!

October 11, 2021 9:01 PM

Shriya Saran : అందాల ముద్దుగుమ్మ శ్రియ ఒక‌ప్పుడు స్టార్ హీరోలంద‌రితో క‌లిసి సినిమాలు చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. 2018లో రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌ను పెళ్లాడ‌గా, ఆ త‌ర్వాత సినిమాల స్పీడ్ త‌గ్గించింది. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో శ్రియ కీల‌క పాత్ర పోషించింది. అయితే కొన్నాళ్లుగా త‌న భ‌ర్త‌తో తెగ సంద‌డి చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వ‌చ్చింది శ్రియ‌.

Shriya Saran secretly given birth to baby girl

తాజాగా ఈ ముద్దుగుమ్మ అంద‌రికీ షాకిచ్చే విష‌యం గురించి చెప్పుకొచ్చింది. గతేడాది స్పెయిన్‌లోని బోర్సిలోనాలోనే శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గతేడాది వెకేషన్‌ నిమిత్తం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోయారు. ఆ స‌మ‌యంలో శ్రియ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం జరిగింది..

శ్రియ తాజాగా త‌ను పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలియ‌జేసింది. ఏడాది త‌ర్వాత ఈ ముద్దుగుమ్మ నోరు విప్ప‌డం విశేషం. 2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయారు. కోవిడ్‌ కారణం‍గా అందరూ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది.

Shriya Saran secretly given birth to baby girl

చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఏంజిల్‌ లాంటి చిన్నారిని మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను.. అంటూ సోషల్‌ మీడియా వేదికగా శుభవార్తను పంచుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment