Yash : మ‌రో ఘ‌న‌త సాధించిన హీరో య‌ష్‌.. ప్ర‌ఖ్యాత ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై..!

October 11, 2021 6:28 PM

Yash : అంత‌ర్జాతీయంగా ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ ఎంత పేరుగాంచిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మ్యాగ‌జైన్‌ను ఇండియాలో కూడా ప్ర‌చురిస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా ఫైనాన్స్‌, ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు, మార్కెటింగ్ వంటి అంశాల్లో రాణిస్తున్న వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక వేత్త‌లు, ధ‌నికుల గురించి ఎక్కువ‌గా క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తుంటారు.

Yash appeared on famous magazine forbes cover page

అయితే ఈసారి ఫోర్బ్స్ యాజ‌మాన్యం సినిమా ఇండ‌స్ట్రీపై దృష్టి సారించింది. అందులోనూ ముఖ్యంగా ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇటీవ‌లి కాలంలో ఎంతో పేరు తెచ్చుకున్న ప‌లువురుల న‌టీనటుల ఫోటోల‌ను క‌వ‌ర్ పేజీలుగా అచ్చు వేసింది. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణాదిలో లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న న‌య‌న‌తార ఫొటోను మొద‌టి క‌వ‌ర్ పేజీగా ఫోర్బ్స్ అచ్చు వేసింది.

ఇక మ‌రో ద‌క్షిణాది న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ ఫొటోను రెండో క‌వ‌ర్ ఆర్టిక‌ల్ ఫొటోకు అచ్చు వేసింది. ఇక మూడో క‌వ‌ర్ పేజీకి య‌ష్ ఫొటోను అచ్చు వేశారు. దీంతో ఈ ఘ‌న‌త సాధించిన తొలి క‌న్న‌డ యాక్ట‌ర్‌గా య‌ష్ రికార్డు సృష్టించారు. ఆ క‌థ‌నంలో య‌ష్‌కు చెందిన జీవితంలోని ముఖ్య ఘ‌ట్టాల‌ను చ‌ద‌వ‌చ్చు.

ఇక య‌ష్ హీరోగా రూపొందుతున్న కేజీఎఫ్‌: చాప్ట‌ర్ 2 వ‌చ్చే ఏడాది.. అంటే 2022లో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment