Balakrishna : ఎన్టీఆర్, స‌మంత‌, నాగార్జున‌, బాల‌కృష్ణ.. వ‌రుస‌పెట్టేశారుగా..!

October 10, 2021 4:20 PM

Balakrishna : ఇన్నాళ్లూ వెండితెర‌పై సంద‌డి చేసిన స్టార్స్ ఇప్పుడు బుల్లితెరపై హంగామా సృష్టిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోలు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌గా, ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధం అయ్యారు. ఓటీటీ వేదికగా బాల‌కృష్ణ ఓ టాక్ షో చేయ‌బోతున్న విషయాన్ని ఆదివారం ఆహా ఓ పోస్టర్‌ విడుదల చేసి ప్ర‌క‌టించింది. ‘ఆయన అడుగేస్తే.. షో మొదలేడితే.. టాక్‌ షోలన్నింటికీ బాప్‌ త్వరలో రానుంది..! పైసా వసూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది.

Balakrishna to host talk show on Aha OTT

అన్‌స్టాప‌బుల్ అనే పేరుతో మొద‌లు కానున్న ఈ షో తొలి ఎపిసోడ్లో మోహన్ బాబు, ఆయన పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న అతిథులుగా రాబోతున్నట్లు స‌మాచారం. ఇక ఈ రోజు ఎన్టీఆర్ షోకి స‌మంత కూడా రానున్న‌ట్టు కన్‌ఫాం అయింది. జెమిని టీవీలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసే ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు’లో సమంత పాల్గొన్న విషయాన్ని ప్రోమో వీడియో ద్వారా క‌న్‌ఫాం చేశారు. ప్రోమోలో స‌మంత సీట్ చాలా హాట్‌గా ఉంద‌ని చెప్ప‌డంతోనే ఈ షోపై అంచ‌నాలు పెరిగాయి. దసరా నవరాత్రుల స్పెషల్‌గా ఈ ఎపిసోడ్‌ రాబోతోందని ప్రకటించారు.

ఇక ఈ రోజు బిగ్ బాస్ స్పెష‌ల్ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. సాయంత్రం 6గం.ల నుండి బిగ్ బాస్ కార్యక్ర‌మం మొద‌లు కానుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి అఖిల్, పూజా హెగ్డే గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యారు. వీరిద్ద‌రూ క‌లిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్ర ప్ర‌మోష‌న్ లోభాగంగా బిగ్ బాస్ స్టేజ్‌పై సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. నాగార్జున బంగ‌ర్రాజు గెట‌ప్‌లో షోకి హాజ‌రు కాగా, ఆయ‌న ప‌లువురు స్టార్స్‌తో క‌లిసి సంద‌డి చేయ‌నున్నారు. ఏదేమైనా వెండితెర స్టార్స్ బుల్లితెర‌పై ర‌చ్చ చేస్తుండ‌డం అభిమానుల‌కి చాలా ఆనందాన్ని క‌లిగిస్తోందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now