Jackky Bhagnani : ర‌కుల్ ప్రీత్ సింగ్ బాయ్ ఫ్రెండ్ జాకీ భ‌గ్నానీ.. ఆయ‌న ఎవ‌రో తెలుసా ?

October 10, 2021 3:42 PM

Jackky Bhagnani : ర‌కుల్ ప్రీత్ సింగ్ అభిమానులంద‌రికీ బిగ్ స‌ర్‌ప్రైజింగ్ న్యూస్ చెప్పింది. తాను ప్రేమించిన జాకీ భ‌గ్నాని అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఆమె చెప్ప‌క‌నే చెప్పింది. ఈ మేర‌కు ఆమె అత‌ని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఇంత‌కీ అస‌లు ఈ జాకీ భ‌గ్నాని ఎవరు ? ఏం చేస్తారు ? అని అభిమానులు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రి ఆయ‌న గురించిన వివ‌రాల‌ను తెలుసుకుందామా..!

rakul preet singh boy friend jackky bhagnani who is he

జాకీ భ‌గ్నానీ బాలీవుడ్ న‌టుడు. నిర్మాత‌గా కూడా ప‌లు చిత్రాల‌ను నిర్మించారు. ఈయ‌న స్వ‌స్థ‌లం కోల్‌క‌తా. సింధీ కుటుంబంలో జ‌న్మించారు. పూజా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఆయ‌న తండ్రి వషు భ‌గ్నాని సినిమాల‌ను నిర్మిస్తున్నారు.

ఇక జాకీ భ‌గ్నానీ 2009లో ఓ హిందీ సినిమా ద్వారా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. ఎక్కువ‌గా ఆయ‌న స‌హాయ‌క పాత్ర‌లు చేశారు. 2016లో స‌ర‌బ్‌జిత్ సినిమా నిర్మాత‌గా ఉన్నారు. ఇక ఆ మూవీలో ఐశ్వ‌ర్యారాయ్‌, ర‌ణ‌దీప్ హుడాలు కీల‌క పాత్ర‌లు పోషించారు. కాగా త్వ‌ర‌లో జాకీ భ‌గ్నానీ.. అక్ష‌య్ కుమార్ హీరోగా, ర‌కుల్ హీరోయిన్‌గా ఓ సినిమాను నిర్మించ‌నున్నారు. అయితే వీరిద్ద‌రికీ బాలీవుడ్ సినిమాల ద్వారానే ప‌రిచయం అయిన‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now