Pragya Jaiswal : పాపం ప్రగ్యా జైస్వాల్‌.. ఆ విధంగా జరిగింది.. ప్ఛ్‌?!

October 10, 2021 10:47 PM

Pragya Jaiswal : మోడ‌ల్‌గా కెరీర్‌ని ప్రారంభించి ఆ త‌ర్వాత ప‌లు సినిమా ఛాన్స్‌లు అందుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. విర‌ట్టు అనే త‌మిళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అభిజీత్ నటించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా రోజులకు ‘కంచె’తో రీలాంచ్ అయింది. ఈ సినిమాకు ప‌లు అవార్డ్‌లు రావ‌డంతో ప్ర‌గ్యాకి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఈ అమ్మడు నటించిన ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఫలితంగా టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్‌లను అందుకోలేకపోయింది.

Pragya Jaiswal got covid positive for the second time

ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ అనే సినిమా చేస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. రీసెంట్‌గా బాల‌య్య‌తో క‌లిసి ప్ర‌గ్యా ప‌లు ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఈ అమ్మ‌డు తాజాగా క‌రోనా బారిన ప‌డింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఈ అమ్మ‌డు క‌రోనా బారిన ప‌డ‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

ప్ర‌గ్యా జైస్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఈ క్ర‌మంలో ప్రగ్యా జైస్వాల్ ఫాలోవర్లను భారీ స్థాయిలో పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ఒక్కోసారి పిక్స్ కూడా షేర్ చేస్తూ హీటెక్కిస్తుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now