Suma : సుమ ఆ బాధ‌ని ఇన్నాళ్లుగా భ‌రిస్తూ న‌వ్వుకుంటూ ఎలా ఉంది ?

October 9, 2021 8:36 PM

Suma : తెలుగు బుల్లితెరపై ప్రముఖ యాంకర్ సుమ కనకాల అంటే ఇప్పటికీ ఎప్పటికీ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా సుమ యాక్టివ్ నెస్ కు ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు. ఎలాంటి రియాలిటీ షోలైనా.. ఈవెంట్స్ అయినా.. ఆడియో, సక్సెస్ మీట్స్ అయినా.. ఇలా ఏదైనా సుమ తన యాంకరింగ్ తో అదరగొడుతుంది. తన సొంత ఐడెంటిటీ కోసం యూట్యూబ్ ఛానెల్ తో తన కుకింగ్ వీడియోస్ తో పాటు ఎన్నో రకాల విషయాల్ని షేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా తన అభిమానులతో ఓ విషయాన్ని షేర్ చేసుకుంది.

Suma how is she laughing when she is facing health problem

చాలా సంవత్సరాలుగా ఓ విషయాన్ని దాచిపెట్టానని.. ఇకపై తమ ఫ్యాన్స్ ముందు ఆ విషయాన్ని దాచాలని అనుకోవడం లేదంటూ చెప్పింది. అదేంటంటే.. తనకు కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ప్రాబ్లెమ్ ఉందని, ఏదైనా గాయమైతే అది మరింత పెద్దది అవుతుందని అన్నారు. ఏదైనా చిన్న గాయం అయితే అది పెద్దగా రియాక్షన్ అవుతుందని అన్నారు. ఇది తగ్గించుకోవడానికి చాలా ట్రీట్ మెంట్స్ తీసుకున్నానని.. ఎన్నో టిప్స్ కూడా ఫాలో అయ్యానని.. కానీ ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపింది.

అయితే ఈ స్కిన్ ప్రాబ్లెమ్ ను తన బాడీలో ఒక పార్ట్ లా మార్చుకున్నానని అన్నారు. ఈ ప్రొఫెషనలిజంలోకి వచ్చినప్పుడు మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీయాలో తెలియక జరిగిన డామేజ్ అని అన్నారు. నిజానికి మన శరీరంలో మనకు శరీరంలో ఏదైనా నచ్చకపోతే ఎదుటివారు ఏమైనా అనుకుంటారేమోనని ఫీలవుతూ దాస్తూ ఉంటారు. ఆ లోపం మనలోనే ఉండిపోతుంది. అనుకున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. ఇది తెలుసుకుంటేనే మన జీవితం చాలా బాగుంటుందని సుమ కనకాల అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now