Che guevara : విప్ల‌వ నాయ‌కుడు చే గువేరా.. జోహార్‌..!

October 9, 2021 5:38 PM

Che guevara : చే గువేరా.. ఈ పేరు విన‌గానే యువ‌త గుండెల్లో విప్ల‌వ జ్వాల‌లు రగిలిపోతాయి. యువ‌త‌కు చే గువేరా అంటే ఎంతో ఇష్టం. ఆయ‌న న‌డిచిన బాట‌లో ప్ర‌యాణించాల‌ని యువ‌త ఆలోచిస్తుంటారు. అందుక‌నే ఆయ‌న బొమ్మ‌ల‌ను దుస్తుల‌పై, వాహ‌నాల‌పై వేసుకుంటుంటారు. అయితే ఈ రోజు (అక్టోబ‌ర్ 9) వ‌ర‌కు చే గువేరా హ‌త్య జ‌రిగి 55 ఏళ్లు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ర‌గిలించిన విప్ల‌వ స్ఫూర్తి మాత్రం ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తోంది.

Che guevara  is inspiration to many

చే గువేరా విప్ల‌వ పోరాట యోధుడు. ఆయ‌న‌ను ఎంతో మంది అభిమానిస్తారు. 1967, అక్టోబ‌ర్ 9న ఆయ‌న‌పై కాల్పులు జ‌ర‌ప‌గా చ‌నిపోయారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఏడాది ఈ రోజును చే గువేరా వ‌ర్దంతిని నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్నారు.

చే గువేరా 14 జూన్ 1928 న అర్జెంటీనాలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఎర్నెస్టో చే గువేరా. ప్రజలు ఆయ‌న‌ను చే అని పిలుస్తారు. చే గువేరా మెడిసిన్ చ‌దివిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆ వృత్తి స్వీక‌రించ‌లేదు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు చేశారు. విప్ల‌వ మార్గాన్ని ఎంచుకుని ఏకంగా మోటార్ సైకిల్‌పై అప్ప‌ట్లోనే 10 వేల కిలోమీట‌ర్ల‌కు పైగా ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అనేక చోట్ల‌కు ఆయ‌న వెళ్లి పేద‌ల ప‌క్షాన పోరాడారు. వారికి స‌హాయం చేశారు. కార్మికుల ప‌క్షాన నిల‌బ‌డి గొంతెత్తి గ‌ళం వినిపించారు. పెట్ట‌బ‌డిదారి శ‌క్తుల‌ను అణ‌చివేసే దిశ‌గా పోరాటాలు చేశారు.

చే గువేరా చ‌నిపోయినా ఆయన చూపిన బాట ఎంతో మందికి ఆచ‌ర‌ణీయం, అనుస‌ర‌ణీయం. ఎంతో మందికి ఆయన ప్రేర‌ణ‌గా నిలుస్తున్నారు. క‌నుక చే గువేరా కు జోహార్..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment