Maa Elections : మా ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్..!

October 9, 2021 6:41 PM

Maa Elections :  గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికల గురించి తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికలలో గెలుపొందడం కోసం నువ్వా నేనా అంటూ మా అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే మా లో సభ్యత్వం పొందిన నటీనటులు అందరి చేత ఓట్లు వేయించుకునేలా మా ప్యానెల్ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు.

Maa Elections actor siddharth interesting comments

ఇకపోతే ఈ ఎన్నికల గురించి పలువురు నటీనటులు తమదైన శైలిలో స్పందిస్తూ కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా తమిళ నటుడు సిద్ధార్థ్ తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం మహాసముద్రం సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను సందడి చేయబోతున్న సిద్ధార్థ్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే అతని వద్ద మా ఎన్నికల గురించి ప్రస్తావన రావడంతో ఈ ఎన్నికలపై ఆయన స్పందిస్తూ మా ఎన్నికలలో రెండు ప్యానెల్ సభ్యుల మాటలు వింటూనే ఉన్నా అయితే తప్పకుండా ఈ ఎన్నికలలో ఓటు వేస్తానని, చివరికి తనకు ఎవరు నచ్చితే వారికే తన ఓటు వేస్తానని చెప్పడం గమనార్హం. మరి రేపు జరగబోయే ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారోనని.. ఎంతో ఉత్కంఠగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now