Roja : మా ఎన్నికలలో నా మద్దతు వారికే.. నటి రోజా !

October 9, 2021 2:31 PM

Roja : అక్టోబర్ 10వ తేదీన జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.

Roja responded on maa elections and told about her vote

ఈ క్రమంలోనే కొందరు సీనియర్ నటీనటులు వారి మద్దతును తెలియజేస్తున్నారు. ఇప్పటికే కోట శ్రీనివాసరావు, నాగ బాబు వంటి వారు వారి మద్దతు తెలియజేయగా తాజాగా మా ఎన్నికలపై నటి ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ మా ఎన్నికలు ఈసారి ఎంతో హోరాహోరీగా సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలలో తను లోకల్, నాన్ లోకల్ అనే అంశాలను దృష్టిలో పెట్టుకోలేదని తెలిపారు.

కేవలం తను ఎన్నికల మేనిఫెస్టోను మాత్రమే చూశానని, అందులో ఏ మ్యానిఫెస్టోలో అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే వారికే నా మద్దతు, వారి ప్యానల్ కే నా ఓటు.. అని ఈ సందర్భంగా రోజా మా ఎన్నికలపై స్పందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now