వ్య‌క్తిని త‌రిమిన ఎలుగుబంటి.. తృటిలో త‌ప్పించుకున్నాడు.. వీడియో..!

April 21, 2021 1:35 PM

వాహ‌నాల మీద ప్ర‌యాణించేట‌ప్పుడు కుక్క‌లు ఎగ‌బ‌డితే త‌ప్పించుకోవ‌చ్చు. కానీ కొన్ని సార్లు వాటి నుంచి త‌ప్పించుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. అయితే అట‌వీ ప్రాంతాల్లో వాహ‌నాల మీద ప్ర‌యాణించేట‌ప్పుడు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. లేదంటే వ‌న్య ప్రాణులు ఎగ‌బ‌డితే త‌ప్పించుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంది. ఓ వ్య‌క్తికి కూడా అలాగే జ‌రిగింది. కానీ అదృష్ట‌వ‌శాత్తూ అత‌ను ఎలాగో త‌ప్పించుకోగ‌లిగాడు.

man escaped from bear viral video

మాంటానా అనే ప్రాంతంలో కొండ నుంచి కింద‌కు ఓ మౌంటెయిన్ బైక్ మీద ఓ వ్య‌క్తి ప్ర‌యాణం చేస్తున్నాడు. అత‌ని వెనుక ఓ ఎలుగుబంటి త‌రుముకొచ్చింది. అత‌న్ని వెంబ‌డించింది. దీంతో అత‌ను భ‌య‌ప‌డ‌కుండా బైక్‌ను ముందుకు పోనిచ్చాడు. ఈ క్ర‌మంలో అత‌ను ఆ ఎలుగుబంటి నుంచి సుర‌క్షితంగా త‌ప్పించుకోగ‌లిగాడు. అత‌ను బైక్ మీద ప్ర‌యాణిస్తున్నాడు కాబ‌ట్టి ఓకే. లేదంటే ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏర్ప‌డి ఉండేది.

ఇక ఆ స‌మ‌యంలో తీసిన ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేయ‌గా అది వైర‌ల్‌గా మారింది. దాన్ని ఇప్ప‌టికే చాలా మంది వీక్షించారు. చాలా చాక‌చ‌క్యంగా అత‌ను త‌ప్పించుకున్నాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now