ఇకపై కంటికి కనిపించని సెల్ఫీ కెమెరాలు.. కొత్త టెక్నాలజీతో వరుసగా లాంచ్!

April 21, 2021 3:08 PM

ఇప్పటివరకు వివిధ రకాల సిరీస్ లతో ఎన్నో రకాల ఫోన్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. అయితే ఈ ఫోన్లలో సెల్ఫీ కెమెరా మనకు డిస్ ప్లే పై కనిపించేది. అయితే ఇకపై సెల్ ఫోన్ డిస్ ప్లే పై సెల్ఫీ కెమెరా మాయమవుతుంది. ఈ సెల్ఫీ కెమెరాను అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాలతో ఈ సంవత్సరం శాంసంగ్, షియోమీ, ఒప్పో, వివో బ్రాండ్లు ఈ ఏడాదిలో లాంచ్ కానున్నట్లు టిప్ స్టర్ తెలిపారు.

ఇప్పటికే ఈ విధంగా అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాలను జెడ్‌టీఈ కంపెనీ యాక్సాన్ 20 5జీ అనే ఫోన్‌ను లాంగ్ చేసింది.అయితే ఇదే ఫీచర్ మరింత మెరుగుపరిచి తొందరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.టిప్ స్టర్ తెలిపిన దాని ప్రకారం.. శాంసంగ్, ఒప్పో ఫోల్డబుల్ ఫోన్లలోనూ, ఎంఐ మిక్స్ 4, వివో, జెడ్‌టీఈ స్మార్ట్ ఫోన్లలో అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాను అందించనున్నారు.

షియోమీ ఇప్పటికే అండర్ డిస్ ప్లే కెమెరా టెక్నాలజీని పరిచయం చేసింది. 2021లో దీనికి సంబంధించిన ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ విధంగా అండర్ డిస్ ప్లే కెమెరా ద్వారా ఫోన్ డిస్ ప్లే పూర్తిగా ఉపయోగించవచ్చు.నాచ్, పంచ్ హోల్ వంటివేమీ అందులో ఉండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now