Maa Elections : ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాస్..!

October 8, 2021 5:54 PM

Maa Elections : అక్టోబర్ 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో మంచు విష్ణు ప్యానల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే వారి ప్యానెల్ కి మద్దతు తెలుపుతున్న వారు సైతం ఇతర ప్యానెల్ సభ్యులపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

Maa Elections kota srinivasa rao comments on prakash raj

తాజాగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలపై స్పందించారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మంచు విష్ణుకు మద్దతు తెలుపుతూ ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

ప్రకాష్ రాజ్ కి క్రమశిక్షణ లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ.. మంచు విష్ణుకి మద్దతు ప్రకటించారు. ప్ర‌కాష్ రాజ్‌లా తాను నేష‌న‌ల్ లెవ‌ల్ ఆర్టిస్ట్ ని అని చెప్పుకోన‌ని అన్నారు. అత‌నితో క‌లిసి 15 సినిమాలు చేశాన‌ని, ఏనాడూ అత‌ను షూటింగ్‌కు టైమ్‌కు రాలేద‌ని, క్ర‌మ శిక్ష‌ణ ఉండ‌ద‌ని, క‌నుక‌ ఆలోచించుకుని ఓటు వేయాల‌ని కోరారు. నాన్ లోక‌ల్‌, లోక‌ల్ అనే గొడ‌వ ఏమీ లేద‌న్నారు.

అక్టోబర్ 10వ తేదీన జరగబోయే ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే 10వ తేదీన ఎవరు గెలుస్తారు అనే విషయంపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now