Bigg Boss 5 : బిగ్ బాస్ రాజ్యానికి రాజుగా యాంకర్ రవి.. కెప్టెన్సీ టాస్క్ రేసులో ప్రియా..!

October 8, 2021 3:50 PM

Bigg Boss 5 : కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన రాజ్యానికి ఒక్కడే రాజు టాస్క్ లో భాగంగా ఏ రాజకుమారుడి దగ్గర ఎక్కువ నాణేలు ఉంటే వారు కెప్టెన్సీగా ఎన్నిక అవుతారని బిగ్ బాస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాణేలు లెక్క పెట్టాల్సిన బాధ్యత బిగ్ బాస్ కెప్టెన్ శ్రీ రామ్ కి చెప్పాడు. అయితే చివరికి నాణేలు కాకుండా ఎవరివైపు ఎక్కువమంది ప్రజలు ఉంటే వారే రాజ్యానికి రాజు అని ప్రకటించడంతో యాంకర్ రవి పక్కన ఏడుగురు ఉంటే సన్ని వైపు 6 మంది ఉండడం చేత రవిని నియమించారు.

Anchor Ravi as the king of the Bigg Boss 5 kingdom Priya in the captaincy task race

ఈ క్రమంలోనే రవి గెలుపొందడంతో రవి గ్రూప్ లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్ లను కెప్టెన్సీ టాస్క్ కోసం నియమించాలని బిగ్ బాస్ చూపించాడు. అందుకు రవి.. హమీద, శ్వేత, అనీ మాస్టర్ పేర్లను తెలియజేశారు. అయితే కెప్టెన్సీ టాస్క్ కి అనర్హులుగా ప్రకటించిన ప్రియకు బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసి తాను కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అవకాశం ఇచ్చాడు. అయితే రవి చెప్పిన వారిలో ఎవరో ఒకరు కెప్టెన్సీ టాస్క్ నుంచి వెను తిరిగితే వారి స్థానంలో ప్రియ ఉంటుంది.

ఈ క్రమంలోనే హమీద కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకోవడంతో ప్రియ కెప్టెన్సీ టాస్క్ రేసులో ఉన్నారు. మరి నేడు జరగబోయే ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ పది వేళ్లు సరిపోవు సోదరా అనే టాస్క్ ఇచ్చారు. నాలుగు వాటర్ డ్రమ్ములు ఇచ్చి వాటి చుట్టూ హోల్స్ పెట్టారు. అయితే బజర్ మోగినప్పుడు హోల్స్ కి ఉన్న ప్లాస్టిక్ స్టిక్కర్ తీసేసి టాస్క్ పూర్తయ్యేలోగా ఎవరి వాటర్ డ్రమ్ములో ఎక్కువ నీళ్ళు ఉంటే వారే కెప్టెన్సీ అని తెలియజేశారు. మరి ఈవారం కెప్టెన్‌గా ఎవరు గెలుస్తారు.. అనేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now