Krithi Shetty : లేటెస్ట్ ఫోటో షూట్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న బేబమ్మ.. ఫోటోలు వైరల్ !

October 7, 2021 11:09 PM

Krithi Shetty : సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత కృతి శెట్టి మొట్టమొదటి సినిమానే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. సరిగ్గా ఇరవై సంవత్సరాలు కూడా పూర్తి కాని ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకుని ప్రస్తుతం అరడజను పైగా సినిమాలను చేతిలో పెట్టుకుని, కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఇక కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Krithi Shetty latest red color dress photos going viral in social media

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ తేజ్ సరసన ఉప్పెన సినిమాలో నటించిన ముద్దుగుమ్మకి మొదటి సినిమానే అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలలో చేతిలో పెట్టుకుని కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న కృతి శెట్టి తాజాగా ఫోటో షూట్ చేసింది.

ఈ క్రమంలోనే రెడ్ కలర్ చుడీదార్ లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ కుర్రకారులకు మతిపోగొడుతున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారాయి. ఇకపోతే కృతి శెట్టి ప్రస్తుతం హీరో రామ్ సరసన లింగస్వామి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా నాని సరసన శ్యామ్ సింగరాయ్, నాగ చైతన్య సరసన బంగార్రాజు చిత్రాలలో నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now