Evaru Meelo Koteeswarulu : ఎన్టీఆర్ షోలో తొలి సారి రూ.1 కోటి గెలుచుకున్న కంటెస్టెంట్ ..!

October 7, 2021 2:20 PM

Evaru Meelo Koteeswarulu : తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ లో ఓ కంటెస్టెంట్ కోటి రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకుని సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో హోస్ట్ అడిగిన అన్నీ ప్రశ్నలకు ఈ కంటెస్టెంట్ సరైన సమాధానాలు చెప్పారు. దాంతో పూర్తి ప్రైజ్ మనీ గెలుచుకున్న వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు.

Evaru Meelo Koteeswarulu contestant won rs 1 crore for the first time

ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో క్వశ్చన్స్ కి సమాధానం చెప్పిన వారు లేరు. దీనిపై అతి త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరులు యాజమాన్యం ఓ అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఎవరు మీలో కోటీశ్వరులు షోకి బ్రిటన్ గేమ్ షో అయిన హూ వాంట్స్ టు బి ఎ మిలినియర్ అనే ప్రోగ్రామ్ ఆధారం. ఈ ప్రోగ్రామ్ ని తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారు.

మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రోగ్రామ్ పై ఓ రేంజ్ లో ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, రాజమౌళిలతో ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షోని ఆడించారు. ఈ ప్రోగ్రామ్ కి ఇక్కడ మనీతో పాటు మనస్సుల్ని కూడా గెలుచుకోవచ్చు అనేది ట్యాగ్ లైన్. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ గా పాల్గొన్నారు.

ఎన్టీఆర్ పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి అల‌రించారు. ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మాన్నిహోస్ట్ చేస్తున్నాడు. ఈ షోకి అంత‌గా రేటింగ్ రావ‌ట్లేద‌ని తెలుస్తోంది. మరోవైపు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” మాత్రం దూసుకెళ్తోంది. మరి రానున్న కాలంలో “ఎవరు మీలో కోటీశ్వరులు” షో “బిగ్ బాస్”ను బీట్ చేస్తుందేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now