న‌కిలీ నోట్ల‌తో మోసం చేసిన స్టార్ హీరో.. మండిప‌డుతున్న ప్ర‌జ‌లు..

October 6, 2021 11:18 PM

మీకెప్పుడైనా రోడ్ల మీద డబ్బులు కనిపించాయా.. వెంటనే వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కదూ.. ఇలాంటి ఇన్సిడెంట్ ని నార్త్ ఇండియాలో ప్రజలు ఎదుర్కున్నారు. అంత కష్టపడి డబ్బుల్ని కలెక్ట్ చేసుకుంటే అవి కాస్తా నకిలీ అని తేలింది. దాంతో డిజప్పాయింట్ అయిన నెటిజన్లు ఒక్కసారిగా బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్ పై మండి పడ్డారు. అసలు వివరాల్లోకి వెళితే..

sunny series shahid kapoor fake currency notes litter on roads

సన్నీ అనే వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వస్తున్న బిగ్గెస్ట్ సిరీస్ సన్నీ. ఈ సిరీస్ లో విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ షూట్ లో ఓ యాక్సిడెంట్ సీన్ ఉంటుంది. ఆ టైమ్ లో రోడ్డుపై 2 వేల రూపాయల నోట్ల కట్టలు పడాలి. దీని కోసం నకిలీ నోట్లతో సీన్ ని షూట్ చేశారు.

కానీ షూట్ అయ్యాక ఆ ప్లేస్ నుండి తీసేయడం మర్చిపోయారు. దీంతో విషయం తెలియని ప్రజలు నిజంగా డబ్బులే అనుకుని ఏరుకున్నారు. తీరా అవి నకిలివి అని తెలిసి ఫీల్ అయ్యారు.

ఈ విషయంలో గాంధీ మహాత్ముడు ఉన్న ఫోటోలు ఉన్న నోట్లు రోడ్డుపై పడేయటం ఏంటని ఈ సిరీస్ టీమ్ పై మండిపడుతున్నారు. అంతేకాకుండా వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ చేశారు. అలాగే గాంధీ ఫోటోలకు అవమానం జరిగిందనే క్రమంలో చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఫిల్మ్ టీమ్ మాత్రం తాము నకిలీ నోట్లను తీసివేశామని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment