Bigg Boss 5 Telugu : ఆ ఇద్ద‌రిలో ఒక‌రు ఈ వారం ఎలిమినేట్ కావ‌డం ప‌క్కానా..!

October 6, 2021 6:06 PM

Bigg Boss 5 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం రోజు రోజుకీ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. 19 మంది స‌భ్యుల‌తో షో మొద‌లు కాగా, ప్ర‌స్తుతం హౌజ్‌లో 15 మంది మాత్ర‌మే ఉన్నారు. తొలివారం స‌ర‌యు ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం ల‌హ‌రి, నాలుగో వారం న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారంలో అత్యధికంగా 9 మంది నామినేషన్స్ లో నిలిచారు. ఇంతవరకూ జరిగిన ఐదు నామినేషన్స్ లోనూ ఒక్కసారి కూడా డేంజర్ జోన్ లోకి వెళ్ళకుండా ఉంది కేవలం శ్వేత వర్మ మాత్రమే.

Bigg Boss 5 Telugu one elimination is guarantee from those two

అయితే ఈ వారం డేంజ‌ర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ష‌ణ్ముఖ్ కి మెజారిటీ మెంబర్స్ (8 మంది) తనను నామినేట్‌ చేయడంతో షణ్ముఖ్ నిజంగానే తన ప్రతిభను ఈ వారం చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వారం అంద‌రి క‌న్నా త‌క్కువ ఓట్స్ విశ్వ‌తో పాటు జెస్సీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. వారి ప్ర‌తిభ ఈ మ‌ధ్య స‌రిగ్గా లేని క్ర‌మంలో ప్రేక్ష‌కులు ఓటు వేసేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని తెలుస్తోంది.

చూస్తుంటే ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి విశ్వ లేదా జెస్సీల‌లో ఒక‌రు ఎలిమినేట్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. నామినేషన్స్ లో షణ్ముఖ్ తర్వాత అత్యధికంగా నాలుగేసి నామినేషన్స్ అందుకున్న వారు ఇద్దరున్నారు. వారిలో ఒకరు జెస్సీ కాగా మరొకరు రవి. ఎక్కువ సమయాన్ని షణ్ముఖ్ తో జెస్సీ గడపడం, అన్ బాలెన్సెడ్ గా ఉండటం వల్ల అతన్ని నామినేట్‌ చేస్తున్నట్టు సభ్యులు చెప్పారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now