Crime News : వామ్మో.. మహా కేటుగాడు.. ఏకంగా 75 మందిని పెళ్ళాడి.. 200 మందిని వ్యభిచారంలోకి దింపాడు..

October 6, 2021 4:07 PM

Crime News : ప్రస్తుత కాలంలో ఒక భార్య, ఇద్దరు బిడ్డలను పోషించాలంటేనే తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ కి చెందిన ఒక ఘరానా మోసగాడు ఏకంగా 75 మందిని వివాహం చేసుకుని.. మరో 200 మంది అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపాడు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిని గుజరాత్ లో సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

crime news man married 75 women arrested by police

బంగ్లాదేశ్ జాసుర్‌కు చెందిన మునీర్ అలియాస్ మునిరుల్ ఉపాధి పేరుతో బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను ఇండియాకు తరలించి వారిని ముంబై, కోల్‌కతాలలో వ్యభిచారంలోకి దింపేవాడు. ఇలా ఇప్పటి వరకు దాదాపుగా 200 మందిని ఇలా వ్యభిచార కూపంలోకి దింపినట్లు పోలీసులు తమ విచారణలో వెల్లడించారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మునీర్ ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. 75 మందిని వివాహం చేసుకున్నట్లు తెలియడంతో పోలీసులు షాక్ అయ్యారు.

అయితే మధ్యప్రదేశ్ ఇండోర్ పోలీసులు ఒక ఓ కేసులో విచారణ చేపట్టగా ఊహించని విధంగా పోలీసులకు మునీర్ బాగోతం తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో గుజరాత్‌లోని సూరత్ లో పోలీసులకు అతను పట్టుబడ్డాడు. కాగా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment