Rakul Preet Singh : కొండపొలం ప్రీ రిలీజ్ వేడుకలో అందాలను ఆరబోసిన రకుల్.. ఫోటోలు వైరల్!

October 6, 2021 1:55 PM

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ తేజ్ సరసన “కొండపొలం” అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్, ట్రైలర్ ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇకపోతే ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో వైభవంగా జరిగింది.

Rakul Preet Singh kondapolam movie pre release photos viral

ఇక ఈ కార్యక్రమానికి చిత్రబృందం అందరూ వచ్చినా రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ఆమె కార్యక్రమానికి ఆలస్యంగా వెళ్లిన అందరిచూపు ఆమెపై పడేలా అందరిని ఆకర్షించింది. చీరకట్టులో తన అందాలను ఆరబోస్తూ రకుల్ ఎంట్రీ అందరినీ ఆకర్షించిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ కొండపొలం సినిమాలో నటించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆ పాత్రలో తాను చేయగలనని నమ్మి ఆ అవకాశాన్ని తనకు కల్పించినందుకు డైరెక్టర్ క్రిష్ కి స్పెషల్ థాంక్స్ అంటూ తెలియజేశారు. అదేవిధంగా వైష్ణవ్ గురించి మాట్లాడుతూ తన కళ్ళలో ఏదో పవర్ ఉందని ఫ్యూచర్లో తాను గొప్ప స్టార్ అవుతారంటూ కొందరు చెబుతుంటారు. నిజానికి ఆయన ఇప్పుడే ఒక గొప్ప స్టార్ గా ఎదిగి పోయాడని ఈ సందర్భంగా వైష్ణవ్ గురించి రకుల్ ప్రీత్ సింగ్ తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now