Yami Gautam : ప‌రిష్కారం లేని చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న అందాల ముద్దుగుమ్మ‌..!

October 5, 2021 9:59 PM

Yami Gautam : అందాల ముద్దుగుమ్మ‌ల మేక‌ప్ వెనుక దాగి ఉన్న చీక‌టి కోణాల గురించి తెలిస్తే కంట క‌న్నీరు రాక మాన‌దు. వెండితెర‌పై అందంగా క‌నిపించే అందాల భామ‌లు ఎన్నో స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అందంగా క‌న‌ప‌డాలని ఒక్కోసారి వారు చేయించుకునే స‌ర్జ‌రీలు విక‌టించి చాలా బాధ‌లు కూడా ప‌డుతుంటారు. ఈ లిస్ట్‌లో ఫెయిర్ అండ్ లవ్లీకి అంబాసిడర్ గా వ్యవహరించిన యామి గౌత‌మ్ కూడా ఉంది.

Yami Gautam is facing cureless skin problems

సుదీర్ఘ కాలం పాటు ఫెయిర్ అండ్ లవ్లీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న యామి గౌతమ్ అనూహ్యంగా తన చర్మ సమస్యను బయటకు చెప్పి అందరినీ ఆశ్చర్య పర్చింది. సోష‌ల్ మీడియాలో చ‌ర్మ స‌మ‌స్య‌ల గురించి మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ‌.. తనకు కెరాటోసిస్ పిలారిస్ అనే చర్మ సంబంధిత సమస్య ఉందని.. ఆ సమస్య కారణంగా తన ముఖంపై చిన్న గడ్డలు ఏర్పడతాయని పేర్కొంది. వాటిని తొల‌గించ‌డం సాధ్యం కాదు. టీనేజ్ నుండి ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాను.. అని తెలిపింది.

ఈ స‌మ‌స్యకు ప‌రిష్కారం లేద‌ని వైద్యులు చెప్పారు. ఇన్ని రోజులుగా పడుతున్న బాధ, భయాలను వదిలించుకునేందుకు గాను బయటకు ఈ విషయాన్ని చెప్పాలనే నిర్ణయానికి వచ్చాను.. అని యామి పేర్కొంది. ఎలాంటి సమస్య అయినా.. ఎప్పటికి అయినా నిజాన్ని స్వీకరించి ముందుకు సాగి పోక తప్పదు. కనుక ఈ విషయంలో తాను ఇంకా ఎక్కువగా ఆలోచించి బాధ పడాలని అనుకోవడం లేదని యామి స్ప‌ష్టం చేసింది. అయితే ఆమె చర్మ సమస్యకు ఫెయిర్ అండ్ లవ్లీ ఏమైనా కారణం అయి ఉంటుందా.. అని కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now