కోలుకుంటున్న సాయి ధ‌ర‌మ్ తేజ్.. సెట్స్‌లో ఎప్పుడు అడుగుపెట్ట‌నున్నాడో తెలుసా ?

October 5, 2021 7:40 PM

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తూ.. తేజ్ స్కిడ్‌ అయి పడిపోయారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు తేజ్‌ని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. 20 రోజులకు పైగానే తేజ్ చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్యంపై అంద‌రిలో ఆందోళ‌న నెల‌కొని ఉంది.

sai dharam tej is recovering soon to go for movie shooting

రీసెంట్‌గా సాయి తేజ్ త‌న ట్విట్ట‌ర్‌లో థంబ్ సైన్ చూపిస్తున్న ఫొటో షేర్ చేస్తూ.. కష్ట సమయంలో అభిమానులు, ఆప్తులు, స్నేహితులు చూపించిన ప్రేమ, అభిమానానికి థాంక్స్ అనే పదం చిన్నదవుతుందని పేర్కొన్నాడు. తన రిపబ్లిక్ మూవీని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. త్వరలో అందర్నీ కలుస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ చూశాక అభిమానుల‌లో ఆనందం అవ‌ధులు దాటింది. అయితే సెట్స్ లోకి ఎప్పుడు అడుగుపెడ‌తాడ‌నే అనుమానాలు నెల‌కొని ఉండ‌గా, వాటికి సంబంధించి ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

తేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత #SDT15 షూటింగ్ లో పాల్గొననున్నారు. ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉండటమే కాకుండా.. కథ – స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానరర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో డిసెంబ‌ర్ నుండి పాల్గొన‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now