Delhi : దారుణం.. మార్కెట్ ఏరియాలో మ‌హిళ గొంతు కోసి చంపేశాడు..

October 5, 2021 9:11 AM

Delhi : దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి మ‌హిళ గొంతు కోసి ప‌రారయ్యాడు. స్థానికులు అత‌న్ని ప‌ట్టుకుని చిత‌క‌బాదారు. అయితే ఆ మ‌హిళ చ‌నిపోగా.. స‌ద‌రు నిందితుడికి ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌లో చికిత్స‌ను అందిస్తున్నారు. పోలీసులు ప్ర‌కారం ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Delhi : దారుణం.. మార్కెట్ ఏరియాలో మ‌హిళ గొంతు కోసి చంపేశాడు..

ఢిల్లీలోని ద్వార‌క అనే ప్రాంతంలో విభ (30) అనే మ‌హిళ త‌న భ‌ర్త‌తో క‌ల‌సి నివ‌సిస్తోంది. ఈ జంట కూర‌గాయ‌ల షాప్‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే దీప‌క్ అనే వ్య‌క్తి ఇటీవల వారి షాప్‌కు పీక‌ల‌దాకా మ‌ద్యం సేవించి వ‌చ్చాడు. దీంతో అత‌నికి, ఆ జంట‌కు గొడ‌వ అయింది. అయితే ఇది మ‌న‌స్సులో పెట్టుకున్న దీప‌క్ విభ‌ను చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

అందులో భాగంగానే అత‌ను ఆదివారం రాత్రి ఆ మ‌హిళ రోడ్డుపై మార్కెట్‌లో న‌డిచి వ‌స్తుండ‌గా.. నెమ్మ‌దిగా వ‌చ్చి ఆమె గొంతు కోశాడు. త‌న‌తోపాటు సంచిలో తెచ్చుకున్న ఓ ప‌దునైన వ‌స్తువుతో ఆమెపై దాడి చేశాడు. అయితే స్థానికులు ఇది గ‌మ‌నించి వెంట‌నే అత‌న్ని ప‌ట్టుకుని చిత‌క‌బాదారు. పోలీసులు రావ‌డంతో వారు నిందితున్ని అరెస్టు చేశారు.

విభ‌ను చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా.. ఆమె అప్ప‌టికే మృతి చెందింద‌ని వైద్యులు తెలిపారు. కాగా నిందితుడిని స్థానికులు కొట్ట‌డం వ‌ల్ల అత‌నికి గాయాలు అయ్యాయ‌ని, అందువ‌ల్ల అత‌నికి చికిత్స కొన‌సాగుతుంద‌ని, అత‌ను డిశ్చార్చి కాగానే అరెస్టు చేస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now