Facebook : ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. అన్నీ డౌన్‌.. ఏవీ ప‌నిచేయ‌డం లేదు..!

October 4, 2021 9:46 PM

Facebook : ప్ర‌ముఖ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌తోపాటు ఆ సంస్థ‌కు చెందిన వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా భార‌త్‌లో ప‌నిచేయ‌డం లేదు. గ‌త 10 నిమిషాల నుంచి ఈ సైట్లు అందుబాటులో లేవు. దీంతో యూజ‌ర్లు ఇత‌ర సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.

Facebook : ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. అన్నీ డౌన్‌.. ఏవీ ప‌నిచేయ‌డం లేదు..!

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ ఏవీ ప‌నిచేయ‌డం లేద‌ని యూజ‌ర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఒకేసారి మూడూ ప‌నిచేయ‌కుండా పోవ‌డం షాక్‌కు గురిచేస్తోంది.

ఈ మూడింటికి చెందిన డెస్క్‌టాప్ సైట్ల‌తోపాటు యాప్‌లు కూడా ఓపెన్ కావ‌డం లేదు. ఓపెన్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తే నాట్ రీచ‌బుల్ అని ఎర్ర‌ర్ చూపిస్తోంది. అయితే స‌మ‌స్య ఇంకా ప‌రిష్కారం కాలేదు. మ‌రి ఫేస్‌బుక్ ఎప్ప‌టి వ‌ర‌కు ప‌రిష్క‌రిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now