Hyderabad : ఫోన్లలో గేమ్స్‌ ఆడొద్దని అన్నందుకు బాలిక ఆత్మహత్య

October 4, 2021 8:52 PM

Hyderabad : ప్రస్తుతం కరోనా కారణం వల్ల పిల్లలకి ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా పిల్లలు పూర్తిగా సెల్ ఫోన్ జీవితానికి అంకితమయ్యారు. ఈ క్రమంలోనే పిల్లలు ఎక్కువ సమయం సెల్ ఫోన్ లోనే గడుపుతున్నారు. తరగతి గదులు పూర్తయినప్పటికీ సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఫోన్లకి పరిమితమవుతున్నారు. ఇలా సెల్ ఫోన్ కి పరిమితమైన ఒక కూతురిని తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

Hyderabad : ఫోన్లలో గేమ్స్‌ ఆడొద్దని అన్నందుకు బాలిక ఆత్మహత్య

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని మీర్‌పేటలో సర్వోదయ నగర్ లో నివాసం ఉండే ఒక బాలిక పదవ తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌లో ఎక్కువగా గేమ్స్ ఆడటం వల్ల తన తండ్రి తనని మందలించాడు. అయితే తండ్రి మందలించాడనే మానసిక వేదనతో ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో ఆ బాలిక కఠినమైన నిర్ణయం తీసుకుంది.

కేవలం తన తండ్రి మందలించాడనే కోపంతోనే ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now