Samantha : విడాకుల తర్వాత మొదటిసారిగా స్పందించిన సమంత.. తాను మారాలంటూ పోస్ట్..

October 4, 2021 11:38 PM

Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ కపుల్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సమంత, నాగచైతన్య దంపతులు పలు మనస్పర్థల కారణంగా వారి వివాహ బంధం నుంచి విడిపోతున్నారంటూ అక్టోబర్ 2వ తేదీన సోషల్ మీడియా వేదికగా వారి నిర్ణయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే వీరు విడాకులు ప్రకటించిన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఏ విధంగానూ స్పందించలేదు.

Samantha : విడాకుల తర్వాత మొదటిసారిగా స్పందించిన సమంత.. తాను మారాలంటూ పోస్ట్..

విడాకుల అనంతరం మొట్ట మొదటిసారిగా స్పందించిన సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఆసక్తికరమైన పోస్టులను చేసింది. ఈ క్రమంలోనే సమంత స్పందిస్తూ.. ప్రపంచం మారాలనుకుంటే ముందు తాను మారాలని, మన పనులన్నింటిని మనమే చేసుకోవాలని, సెల్ఫ్ లో ఉండే దుమ్మును మనమే దులుపుకోవాలని, మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం అనుకున్న లక్ష్యాల గురించి కలలు కనకూడదంటూ.. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది.

ఈ క్రమంలోనే సమంత తన పోస్టు ద్వారా ఒంటరిగా తన లక్ష్యాలను చేరుకోవాలని.. తనకు తానే రక్షణగా నిలబడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విడాకుల తర్వాత మొదటి సారిగా స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. సమంత ఒంటరిగా తన జీవితంలో ముందుకు నడవాలని.. తన లక్ష్యాలను తాను చేరుకోవాలని పలువురు తనకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now