Kondapolam : వివాదంలో ఇరుక్కున్న కొండ‌పొలం సినిమా.. కార‌ణం అదే..!

October 4, 2021 8:47 AM

Kondapolam : ఉప్పెన మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ అద్భుతంగా న‌టించాడు. అంద‌రి ప్ర‌శంస‌ల‌ను ఈ మూవీ ద‌క్కించుకుంది. ఇక వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం.. కొండ‌పొలం. దీన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇందులో వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. అయితే ఈ మూవీ తాజాగా వివాదంలో ఇరుక్కుంది.

Kondapolam : వివాదంలో ఇరుక్కున్న కొండ‌పొలం సినిమా.. కార‌ణం అదే..!

ఈ మూవీలో హీరో పేరుకు చివర యాద‌వ్ అని ఉంటుంది. దీనిపైనే వివాదం నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పాలమూరు కురవ సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శంకరోళ్ల రవి కుమార్ మాట్లాడుతూ.. సినిమాలో హీరో పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

కొండపొలం సినిమాలో త‌మ‌ కురుమ / కురువ కులవృత్తి ఎదుర్కొంటున్న సమస్యలను బాగా చూపించారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంద‌ని అన్నారు. అయితే ఈ సినిమాలో హీరో పేరు కటారు రవీంద్ర యాదవ్ అని పెట్టారు. దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామ‌ని తెలిపారు.

ఎందుకంటే.. యాదవులు అంటే గొర్రెలు, మేకలు కాకుండా గేదెలు, ఇతర పశువుల‌ను కూడా కాస్తార‌ని, కానీ కురుమ, కురువలు గొర్రెలు మాత్ర‌మే కాస్తార‌ని అన్నారు. యాదవులు BC-Dలో కేటగిరీలో ఉండ‌గా, కురుమలు ఇంకా వెనకబడిన వర్గానికి చెంది BC-B లో ఉన్నార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే త‌మ పేరు చివర కురుమ అని పెట్టుకుంటామ‌ని, యాదవుల కుల దైవం మల్లన్న కాగా, త‌మ కుల దైవం బీరప్ప అని అన్నారు. ఇలా రెండు కులాల‌కు భిన్న అంశాలు ఉన్నాయ‌ని, అందువ‌ల్ల ఇది త‌మ అస్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉంద‌ని అన్నారు.

క‌నుక హీరో పేరును మార్చాల‌ని, యాదవ్ అనే పదాన్ని తొలగించినా త‌మ‌కు అభ్యంతరం లేద‌ని తెలిపారు. పేరు మార్చకుండా సినిమాను విడుదల చేస్తే ఆందోళనలు చేస్తాం అని హెచ్చ‌రించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now