వీడియో వైరల్: గర్భిణీల కష్టాలను తెలుసుకోవాలనుకున్న టిక్ టాకర్.. చివరికి ఏమైందంటే?

August 26, 2021 11:06 AM

అమ్మతనం అనేది ప్రతి స్త్రీకి ఎంతో గొప్ప వరం. అయితే అమ్మ అయ్యే సమయంలో ఆ స్త్రీ ఎన్ని బాధలను పడుతుందో ఒక మహిళకు మాత్రమే తెలుస్తుంది. తన బిడ్డ కోసం ఆ బాధలన్నింటినీ ఎంతో ఆనందంగా భరిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీ ఏ విధంగా కష్టాలను భరిస్తుందో తెలుసుకోవాలనే కుతూహలంతో టిక్‌టాకర్ ఒక ప్రయోగం చేశాడు. ప్రస్తుతం ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెయిట్ ల్యాండ్ హాన్లీ అనే ఒక ప్రముఖ టిక్‌టాకర్ తన పొట్టకు పెద్ద పుచ్చకాయను ప్లాస్టర్ సహాయంతో గట్టిగా చుట్టుకున్నాడు. అదేవిధంగా తన ఛాతీ చుట్టూ కూడా రెండు పుచ్చకాయలను కట్టుకొని గర్బిణీ వేషధారణ వేశాడు. ఈ క్రమంలోనే అతడు బెడ్ పై పడుకొని లేవడానికి ప్రయత్నించాడు. అయితే అతను బెడ్ పై నుంచి పైకి లేవడానికి వీలు కాలేదు. అలాగే బాత్రూం వెళ్లడం, షూ ధరించడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాలేదని ఆ తర్వాత హాన్లీ తెలియజేశాడు.

ఈ విధంగా గర్భిణీ వేషధారణలో ఉన్న ఆ వ్యక్తి గర్భిణీల బాధను తెలుసుకోవాలని చేసిన ప్రయోగం అతనికి జ్ఞానోదయం కలిగించింది. నిజంగా గర్భం ధరించిన మహిళలు ఎంతో బాధను అనుభవిస్తారని ఈ సందర్భంగా తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వేషధారణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now