వైర‌ల్

Lorry Driver Incident : లారీ కింద ప‌డి నుజ్జ‌యిన బైక్‌.. తెలివిగా త‌ప్పించుకున్న వాహ‌న‌దారుడు.. వీడియో వైర‌ల్‌..!

Lorry Driver Incident : రోడ్డు ప్ర‌మాదాలు అనేవి చెప్ప‌కుండానే జ‌రుగుతాయి. కానీ వాటి నుంచి త‌ప్పించుకోవ‌డం అన్న‌ది చాలా అరుదుగా జ‌రుగుతుంటుంది. వెంట్రుక వాసిలో ప్ర‌మాదం త‌ప్పింద‌ని చెబుతుంటే మ‌నం చాలా సార్లు విని ఉంటాం. అయితే అక్క‌డ కూడా స‌రిగ్గా అలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..?

హైద‌రాబాద్‌లోని చంపాపేటలో స్థానికంగా ఉండే అబ్దుల్ మ‌జీద్ అనే వ్య‌క్తి ఏప్రిల్ 15వ తేదీన రాత్రి 11.45 గంట‌ల ప్రాంతంలో ఆరామ్‌ఘ‌ర్ నుంచి ల‌క్ష్మీ గార్డెన్స్ వైపు వ‌స్తున్నాడు. అయితే అదే స‌మ‌యంలో లారీతో వెనుక నుంచి వ‌చ్చిన పృథ్వీరాజ్ అనే డ్రైవ‌ర్ లారీని వేగంగా నిర్ల‌క్ష్యంగా న‌డిపించాడు. దీంతో మ‌జీద్ టూవీల‌ర్‌ను లారీ ఢీకొట్టింది. అయితే అదే స‌మ‌యంలో చాక‌చ‌క్యంగా మ‌జీద్ బైక్ మీద నుంచి త‌ప్పించుకుని లారీకి ఒక వైపున ఎక్కి నిల‌బ‌డ్డాడు.

Lorry Driver Incident

ఓ వైపు బైక్ లారీ ముందు చ‌క్రాల కింద ప‌డి నలిగిపోతున్నా, ఒక వ్య‌క్తి లారీ డోర్ ప‌ట్టుకుని నిలుచున్నా డ్రైవ‌ర్ మాత్రం లారీని ఆప‌లేదు. అలాగే పోనిచ్చాడు. త‌రువాత మ‌జీద్ పోలీస్ స్టేష‌న్‌కు చేరుకుని లారీ డ్రైవ‌ర్‌పై ఫిర్యాదు చేశాడు. అయితే లారీ అలా వెళ్తున్న స‌మ‌యంలో అటుగా వ‌స్తున్న కొంద‌రు ఆ మొత్తం సంఘ‌ట‌న‌ను వీడియో తీశారు. అనంత‌రం ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలో ఆ వీడియోను చూసిన నెటిజ‌న్లు ఆ డ్రైవ‌ర్‌పై మండిప‌డుతున్నారు. అంత‌టి ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు ఆ డ్రైవ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. అయితే ఆ లారీ ఆ త‌రువాత ఇంకో కార్‌ను కూడా ఢీకొట్టింద‌ని, ఈ క్ర‌మంలో డ్రైవ‌ర్‌ను అరెస్టు చేసి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM