lifestyle

Mehindi To Hair : జుట్టుకు మెహిందీ పెడితే ఎంతో మేలు.. కానీ ఈ త‌ప్పుల‌ను మాత్రం చేయ‌కండి..!

Mehindi To Hair : జుట్టు అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. జుట్టు న‌ల్ల‌గా, పొడ‌వుగా, ప‌ట్టుకుచ్చులా ఉండాలిన కోరుకోవ‌డంలో త‌ప్పే లేదు. జుట్టు అందంగా క‌న‌బ‌డ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు కూడా చేస్తూ ఉంటారు. చాలా మంది జుట్టు అందంగా, సిల్కీగా క‌న‌బ‌డ‌డానికి జుట్టుకు హెన్నాను రాస్తూ ఉంటారు. హెన్నాను చాలా మంది వాడుతూ ఉంటారు. అలాగే హెన్నాను వాడ‌డం వ‌ల్ల జుట్టు అందంగా త‌యార‌వుతుంద‌ని చాలా కాలంగా ప్రాచుర్యంలో కూడా ఉంది. తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డంలో, జుట్టును ప‌ట్టుకుచ్చులా త‌యారు చేయ‌డంలో హెన్నా మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే మ‌న‌కు మార్కెట్ లో వివిధ ర‌కాల హెన్నా ల‌భిస్తూ ఉంటుంది. ప్ర‌జ‌లు వారికి న‌చ్చిన కంపెనీల హెన్నాను తెచ్చుకుని వాడుతూ ఉంటారు. అయితే హెన్నాను వాడేట‌ప్పుడు చాలా మంది తెలియ‌క అనేక త‌ప్పులు చేస్తూ ఉంటారు. దీని వ‌ల్ల మ‌న జుట్టుకు మేలు చేసే హెన్నా హానిని క‌లిగించేదిగా మారుతుంది.

జుట్టుకు హెన్నాను వాడే వారు తెలుసుకోవాల్సిన ముఖ్య విష‌యాల గురించి అలాగే వారు హెన్నాను వాడేట‌ప్పుడు చేస్తున్న త‌ప్పులు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కొంద‌రు హెన్నాను జుట్టుకు రాసేట‌ప్పుడు అందులో నిమ్మ‌ర‌సం, పెరుగు వంటివి క‌లుపుతూ ఉంటారు. నిమ్మ‌ర‌సంలో ఆమ్ల‌త్వం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది జుట్టు పొడిబారేలా చేస్తుంది. అలాగే పెరుగును క‌ల‌ప‌డం వ‌ల్ల మ‌న‌కు ఆశించిన ఫ‌లితాలు రాక‌పోవ‌చ్చు. క‌నుక హెన్నాలో ఇవి క‌ల‌ప‌క‌పోవ‌డ‌మే మంచిది. అలాగే హెన్నాను కొంద‌రు అప్ప‌టిక‌ప్పుడు క‌లిపేసి వాడుతూ ఉంటారు. కానీ జుట్టుకు మంచి రంగు రావాలంటే హెన్నాను 8 నుండి 12 గంట‌ల వ‌ర‌కు నాన‌బెట్టిన త‌రువాతే వాడాలి. ముందు రోజు రాత్రి నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు హెన్నాను వాడడం మంచిది. ఇక కొంద‌రు హెన్నాను ప్లాస్టిక్ గిన్నెలో క‌లిపి వాడుతూ ఉంటారు. కానీ హెన్నాను వాడాలనుకునే వారు స్టెయిన్ స్టీల్ లేదా ఐర‌న్ గిన్నెల‌ను వాడ‌డం మంచిది.

Mehindi To Hair

ఇలా వాడ‌డం వ‌ల్ల హెన్నా నుండి రంగు మ‌రింత ఎక్కువ‌గా విడుద‌ల అవుతుంది. అలాగే దీనిని క‌ల‌ప‌డానికి ప్లాస్టిక్ స్పూన్స్ కు బ‌దులుగా గ‌రిటెను లేదా స్టీల్ చెంచాల‌ను వాడ‌డం మంచిది. అలాగే చాలా మంది హెన్నాను సాధార‌ణ నీటిలో క‌లిపి జుట్టుకు రాస్తూ ఉంటారు. ఇలా సాధార‌ణ నీటిని వాడ‌డానికి బ‌దులుగా టీ లేదా కాఫీ డికాష‌న్ ను వాడ‌డం మంచిది. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు మ‌రింత న‌ల్ల‌గా మారుతుంది. ఈ విధంగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ హెన్నాను వాడ‌డం వ‌ల్ల జుట్టు మ‌రింత అందంగా త‌యార‌వుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM