ఆధ్యాత్మికం

Amarnath Yatra 2024 : అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు ఎలా వెళ్లాలి.. అందుకు ఎలా దర‌ఖాస్తు చేయాలి.. అంటే..?

Amarnath Yatra 2024 : మీరు అమ‌ర్ నాథ్ యాత్ర‌కు వెళ్లాలి అనుకుంటున్నారా… అయితే ఇది మీకు గొప్ప అవ‌కాశం రానే వ‌చ్చింది. అమర్ నాథ్ గుహలో మంచు శివ‌లింగాన్ని చూడ‌డానికి భ‌క్తుల నిరీక్ష‌ణ ముగిసింద‌నే చెప్ప‌వ‌చ్చు. అమ‌ర్ నాథ్ యాత్ర కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ సోమ‌వారం ఏప్రిల్ 15, 2024 నుండి ప్రారంభ‌మైంది. ఇక అమ‌ర్ నాథ్ యాత్ర‌ను జూన్ 29 2024 నుండి ప్రారంభించాల‌ని కూడా నిర్ణ‌యించారు. జూన్ 29 నుండి ప్రారంభ‌మ‌య్యి ఈ యాత్ర ఆగ‌స్టు 10 న ముగియ‌నుంది. శ్రీ అమ‌ర్ నాథ్ పుణ్య‌క్షేత్ర బోర్డు త‌న వెబ్ సైట్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. అలాగే అమ‌ర్ నాథ్ యాత్ర 2024 కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేష‌న్ ఫీజు ఒక్కొక్క‌రికి 150 రూ. గా నిర్ణ‌యించ‌బ‌డింది. అమ‌ర్ నాథ్ యాత్ర కోసం రిజిస్టేష‌న్ ఫీజుల‌ను వెబ్ సైట్ లో పేర్కొన్న బ్యాంక్ శాఖల ద్వారా చెల్లించ‌వ‌చ్చు.

మీరు అమ‌ర్ నాథ్ ద‌ర్శ‌నం చేసుకోవాలంటే అధికారిక వెబ్ సైట్ jksasb.nic.in లో న‌మోదు చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా అమ‌ర్ నాథ్ బోర్డు మొబైల్ ఆప్లికేష‌న్ ద్వారా కూడా న‌మోదు చేసుకోవ‌చ్చు. ఇక ఈ యాత్ర‌కు వెళ్లాల‌నుకునే వారికి ఆరోగ్య ధృవీక‌ర‌ణ ప‌త్రం చాలా అవ‌స‌రం. ప్ర‌భుత్వ అధికారిక వైద్యుడు జారీ చేసిన ఆరోగ్య ధృవీక‌ర‌ణ పత్రం లేకుండా ఈ యాత్ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోలేరు. అలాగే దేశంలోని జ‌మ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ‌రియు ఎస్ బ్యాంక్ ల‌కు చెందిన 540 బ్రాంచ్ ల‌లో యాత్ర‌కు సంబంధించిన రిజిస్ట్రేష‌న్ చేయ‌బ‌డుతుంది. ఇందుకోసం ద‌ర‌ఖాస్తుదారుడి ఫోటో, రిజిస్ట్రేష‌న్ ఫీజు, గ్రూప్ లీడ‌ర్ పేరు, ఫోన్ నెంబ‌ర్, ఇమెయిల్ తో పాటు చిరునామాను ఇవ్వాలి. అలాగే పోస్ట‌ల్ చార్జీలు 1 నుండి 5 గురు భ‌క్తుల‌కు రూ.50, 6 నుండి 10 వ‌ర‌కు రూ100, 11 నుండి 15 మంది భ‌క్తుల‌కు రూ. 150, 16 నుండి 20 వ‌ర‌కు రూ.200, 21 నుండి 25 వ‌ర‌కు రూ. 250, 26 నుండి 30 వ‌ర‌కు రూ. 300 ఖ‌ర్చు అవుతుంది.

Amarnath Yatra 2024

అలాగే ఏప్రిల్ 8 త‌రువాత తీసుకోబ‌డిన ఆరోగ్య ధృవీక‌ర‌ణ పత్రం మాత్ర‌మే చెల్లుబ‌డి అవుతుంది. ఇక యాత్రకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ముందుగా అధికారిక వెబ్ సైట్ లో యాత్ర‌కు సంబంధించిన విష‌యాలు అన్ని చ‌దివి ఆ త‌రువాత ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ యాత్ర‌కు 13 సంవ‌త్స‌రాల నుండి 70 ఏళ్ల లోపు వారికి మాత్ర‌మే అనుమ‌తి ఉంది. అంతేకాకుండా ఈ యాత్ర‌కు 6 వారాల కంటే ఎక్కువ ఉన్న గ‌ర్భిణీ స్త్రీలు కూడా న‌మోదు చేసుకోలేరు. ఇక యాత్ర‌కు వెళ్ల‌లేని వారు యాత్ర ప్రారంభ‌మైన త‌రువాత ఉద‌యం మ‌రియు సాయంత్రం హార‌తిని ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారం చేస్తారు. అమ‌ర్ నాథ్ పుణ్య‌క్షేత్ర బోర్డు అధికారిక వెబ్ సైట్ మ‌రియు ఆప్ లో దీనిని చూడ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM