ఆగస్టు 15న దేశ వ్యాప్తంగా అందరూ ఎంతో సంతోషంగా దేశ భక్తిని చాటుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాజకీయనాయకులు జెండా ఎగురవేసి జాతీయ పతాకానికి వందనం చేశారు. ఈ విధంగా దేశ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటూ ఆనందంలో ఉండగా జార్ఖండ్ ధన్‌బాద్‌లో మాత్రం అవి విషాదం అయ్యాయి. అక్కడి కాంగ్రెస్ నేత అన్వర్ హుస్సేన్ జండా వందనం చేస్తూ ఉన్నఫలంగా కుప్పకూలిపోయారు.
అప్పటివరకు స్వాతంత్ర దినోత్సవం చరిత్ర గురించి మాట్లాడిన ఆయన జెండా ఎగురవేసి జెండాకు సెల్యూట్ చేస్తూ అక్కడే కుప్పకూలి పోవడంతో ఏం జరిగిందో తెలియక కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని హుటాహుటిన కాంగ్రెస్ నేతను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కాంగ్రెస్ నేత అన్వర్ హుస్సేన్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
చిర్కుండా బ్లాక్ అధ్యక్షుడుగా. ఉన్న అన్వర్ హుస్సేన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కూలిపోయే మృతి చెందినట్లు తెలియడంతో చిర్కుండా బ్లాక్ లో విషాదఛాయలు అలుముకున్నాయి అప్పటివరకు ఆనందంలో ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…