వైర‌ల్

క‌రోనాను త‌రిమికొట్టేందుకు దుర్గా మాతకు గోల్డ్ మాస్క్.. ఎక్కడంటే ?

ఒకప్పుడు దేవతా విగ్రహాలకు భక్తులు పెద్ద ఎత్తున బంగారు లేదా వెండి కిరీటాలను, ఇతర అలంకరణ వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు. అయితే తాజాగా కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి జీవితంలో మాస్క్ అనేది ఒక భాగమైపోయింది. ఈ క్రమంలోనే అమ్మవారి అలంకరణలో కూడా మాస్క్ భాగమైంది. తాజాగా కోల్‌కతా బగుయాటీ ఏరియాలోని పూజా మండపంలో అమ్మవారికి 20 గ్రాముల బంగారంతో చేసిన మాస్క్ తొడిగారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేవలం అమ్మవారి విగ్రహానికి మాస్క్ తోడగడమే కాకుండా అమ్మవారి చేతిలో ఆయుధాలకు బదులుగా శానిటైజర్ లు, సిరంజీలు, ఆక్సి మీటర్లు, వంటి వైద్య పరికరాలు ఉంచడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేయడానికి కూడా ఒక కారణం ఉంది.ఈ విధంగా అమ్మవారికి మాస్క్ వేయటం వల్ల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సైతం మాస్కులు ధరిస్తారని, ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలను పాటించడం వల్ల కరోనాను తరిమికొట్టడానికి వీలవుతుందని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అమ్మవారి విగ్రహం ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా అమ్మ వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, బెంగాల్ సింగర్ అదితీ మున్షీ అన్నారు. బెంగాల్‌లో అత్యంత వైభవంగా జరిగే కాళీ మాత వేడుకలలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడం వల్ల కరోనా వ్యాప్తికి కారకులవుతారు కనుక ఈ క్రమంలోనే ప్రజలు పెద్ద ఎత్తున ఒకేచోట చేరకుండా ఎక్కడికక్కడ ఈ విధమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM