చిన్నతనం ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో తీపి గుర్తుగా మిగిలిపోవాలి. ఆడుతూ పాడుతూ సాగిపోవాల్సిన బాల్యంపై కుటుంబ భారం పడింది. స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా ఆడుకోవలసిన ఆ పసివాడు తన కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకొని ఎనిమిదేళ్ళ వయసులోనే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నాడు. 8 ఏళ్ల కుర్రాడు ఒక్క రోజు పనికి వెళ్లకపోతే కుటుంబం గడవడం భారంగా మారుతుంది. ఈ చిన్నారి పరిస్థితి వింటే ఎవరికైనా అయ్యో పాపం అనిపించకమానదు.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలో ఓ యువకుడు కారులో వెళ్తూ రోడ్డుపై వెళ్తున్న ఓ బ్యాటరీ ఆటోను చూశాడు. అయితే ఆటో నడుపుతున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే ఆ ఆటో నడుపుతున్న ఎనిమిది సంవత్సరాల బాలుడిని చూసి ఆశ్చర్యానికి గురైన ఆ వ్యక్తి ఆటో ఆపి ఆ కుర్రాడిని ప్రశ్నించాడు. అసలు ఇంత చిన్న వయసులో ఆటో నడపడానికి గల కారణం ఏంటని ఆ కుర్రాడిని ప్రశ్నించగా అక్కడికి పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు.
ఈ క్రమంలోనే ఆటోలో వెనుక వైపు కూర్చున్న వ్యక్తి స్పందిస్తూ ఆ కుర్రాడి పేరు రాజగోపాల్ రెడ్డి అని తను వారి పెద్ద కొడుకు అని సమాధానం చెప్పాడు. తను, తన భార్య ఇద్దరూ అంధులు కావటం వల్ల కుటుంబ పోషణ భారమైందని, ఈ క్రమంలోనే తన పెద్ద కుమారుడు రాజగోపాల్ రెడ్డి కుటుంబ బాధ్యతను తీసుకున్నాడని ఆ వ్యక్తి తెలియజేశాడు. ఇంత చిన్న వయస్సులో లైసెన్స్ లేకుండా బండి నడపడం చట్టపరంగా నేరమని తెలిసినప్పటికీ కుటుంబ పోషణ కోసం తప్పడంలేదని, ఒక్కరోజు వీరు కష్ట పడకపోతే కుటుంబం మొత్తం పస్తులు ఉండాలని తెలిపాడు. తన తండ్రితో పాటు ఆటోలో పప్పు దినుసులు వేసుకుని వీధి వీధి తిరుగుతూ అమ్ముతున్నట్లు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి, అతని తండ్రి తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…