Weekly Numerology : 4 అంకె రోజు పుట్టిన వారికి ఏప్రిల్ మొత్తం ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది.. ఇంకా ఏమేం ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

April 2, 2024 8:02 AM

Weekly Numerology : మ‌న‌లో చాలా మంది జోతిష్య శాస్త్రాన్ని, వాస్తు శాస్తాన్ని న‌మ్మిన‌ట్టే న్యూమరాలజీని కూడా విశ్వ‌సిస్తారు. న్యూమారాల‌జీలో, పుట్టిన తేది మ‌రియు రాడిక్స్ సంఖ్య ఆధారంగా భ‌విష్య‌త్తును చెబుతారు. ఏప్రిల్ నెల ప్రారంభ‌మైంది. క‌నుక ఏప్రిల్ మొద‌టి వారం రాడిక్స్ సంఖ్య 1 నుండి 9 గ‌ల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సంఖ్య 1 :- కెరీర్ ప‌రంగా ఈ వారం చాలా చ‌క్కగా ఉంటుంది. జీవితంలో పురోగ‌తిని సాధిస్తారు. కొత్త ఉద్యోగాన్ని కూడా పొంద‌వ‌చ్చు. శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. మీ మీద అసూయ ఉన్న వారికి దూరంగా ఉండ‌డం మంచిది.

సంఖ్య 2 :- స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే ప‌నుల‌ను చేస్తారు. మాన‌సిక ఒడిదుడుక‌ల‌ను అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. అలాగే స‌వాలును ఎదుర్కోవ‌డంలో విజయం సాధిస్తారు.

సంఖ్య 3 :- ఈ వారం మీ జీవితంలో సానుకూల‌త పెరుగుతుంది. కెరీర్ లో పురోగ‌తి ఉండ‌డంతో పాటు కొత్త అవ‌కాశాలు ల‌భిస్తాయి. శుభ‌వార్త‌లు వింటారు. బంధువుల నుండి ఆనందం పొందుతారు.

Weekly Numerology how this april 2024 will effect for these people
Weekly Numerology

సంఖ్య 4 :- ఈ వారం మీరు సామాజిక సంబంధాల‌ను ఏర్ప‌రుచుకుంటారు మ‌రియు ప్ర‌జ‌ల దృష్టికి వ‌స్తారు. గౌర‌వం పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్ట‌డం చాలా అవ‌స‌రం.

సంఖ్య 5 :- త‌గాదాల నుండి బ‌య‌ట‌ప‌డ‌డం మంచిది. వ్య‌కిగ‌త సంబంధాల‌లో వ‌చ్చే వివాదాలు మంచివి కావు. క‌ష్టానికి త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. కుటుంబంతో సానుకూలంగా ఉండ‌డం మంచిది.

సంఖ్య 6 :- ఈ వారం మీరు ఆశ మ‌రియు భ‌యం మ‌ధ్య ఊగిస‌లాడుతూ ఉంటారు. ఆలోచ‌న‌ల‌ను సానుకూలంగా ఉంచుకోవ‌డం మంచిది. కెరీర్ ప‌రంగా విజ‌య ప‌థంలో ఉన్నారు. ముందు చేసిన త‌ప్పుల నుండి మంచి నేర్చుకుని ముందుకు సాగడం మంచిది.

సంఖ్య 7 :- మీకు ఉండే ఉదార‌మైన మ‌న‌సు మ‌రియు ద‌య ఇత‌రుల జీవితాల్లో ఆనందాన్ని క‌లిగిస్తుంది. ఈ వారం మీకు లాభాల‌ను అందిస్తుంది. అలాగే మీ జీవితంలోకి ఒక ముఖ్యమైన వ్య‌క్తి రావ‌చ్చు.

సంఖ్య 8 :- ఈ వారం మీ జీవితంలో కొత్త మార్పులు, కొత్త మ‌లుపులు వ‌స్తాయి. ఈ కొత్త మార్పులు మీ దృక్ప‌థాన్నే మార్చేస్తాయి. ఈ మార్పుల వ‌ల్ల మీకు ప్రయోజ‌నం చేకూరుతుంది.

సంఖ్య 9 :- మీకు ఉన్న బాధ్య‌త‌లు మీరు మ‌రింత ప‌ని చేసేలా చేస్తాయి. మీ యొక్క సంభాష‌ణ శైలి ఇత‌రుల‌ను ప్ర‌భావితం చేస్తుంది. అలాగే మీ న‌మ్మ‌కం మీ సామ‌ర్థ్యం మీ క‌ల‌ల‌ను నెర‌వేరుస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now