Vehicle Colors : వాహ‌నం కొంటున్నారా..? మీ న‌క్ష‌త్రం ప్ర‌కారం ఏ రంగు అయితే మంచిదో తెలుసుకోండి..!

December 15, 2023 11:13 AM

Vehicle Colors : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చాలామంది ఎన్నో విషయాలని పాటిస్తూ ఉంటారు. రాశి ఆధారంగా, నక్షత్రం ఆధారంగా పండితులను అడిగి, తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉంటారు. అలా చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? మీ నక్షత్రం ప్రకారం, ఏ రంగు మంచిదో చూడండి. అశ్విని నక్షత్రం వాళ్ళు వెండి రంగుకి ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే ఎరుపు రంగు కూడా తీసుకో వచ్చు. భరణి నక్షత్రం వాళ్లకి తెలుపు, వెండి రంగు బాగుంటుంది. కృత్తిక నక్షత్రం వారికి ఎరుపు, తెలుపు బాగుంటాయి.

రోహిణి నక్షత్రం తెలుపు, వెండి రంగు. మృగశిర నక్షత్రం ఎరుపు, తెలుపు, పసుపు. మృగశిర వాళ్లకు ఎరుపు, తెలుపు, పసుపు. ఆరుద్ర కి నీలం, నలుపు, బ్రౌన్, ఆకుపచ్చ. పునర్వసు వాళ్లకు తెలుపు, వెండి, ఆకుపచ్చ. పుష్యమి నీలం, నలుపు, తెలుపు. ఆశ్లేష వాళ్లకు ఆకుపచ్చ, తెలుపు బాగుంటాయి.

Vehicle Colors which one to buy according to star
Vehicle Colors

మఖ తెలుపు, వెండి రంగులు మంచివి. పుబ్బ నక్షత్రం కి తెలుపు, వెండి, ఎరుపు. ఉత్తర కి ఎరుపు, తెలుపు. హస్త వాళ్లకు తెలుపు, వెండి, నీలం. చిత్త వాళ్లకి ఎరుపు, వెండి బాగుంటుంది. స్వాతి కి బ్రౌన్, వెండి రంగులు మంచిది. విశాఖ కి పసుపు, వెండి, తెలుపు బాగుంటుంది.

అనురాధ వాళ్లకు నీలం, నలుపు, ఎరుపు. జ్యేష్ఠ కి తెలుపు, వెండి, ఆకుపచ్చ. మూల కి తెలుపు, వెండి రంగులు బాగుంటాయి. పూర్వాషాడ వాళ్లకు వెండి, పసుపు. ఉత్తరాషాడ వాళ్లకి ఎరుపు, పసుపు, నీలం. శ్రవణం వాళ్లకు తెలుపు, వెండి, నీలం బాగుంటుంది. ధనిష్ట కి ఎరుపు, నీలం. శతభిషకి నీలం, నలుపు, బ్రౌన్. పూర్వాభద్ర వాళ్లకు పసుపు, నీలం. ఉత్తారాభాద్ర కి నీలం, నలుపు. రేవతి ఆకుపచ్చ, తెలుపు బాగుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now