Vastu Tips For Wealth : మీ ఇంట్లో సంప‌ద‌, శ్రేయ‌స్సు పెర‌గాలంటే.. ఈ వాస్తు చిట్కాల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

September 15, 2023 8:28 AM

Vastu Tips For Wealth : వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. వాస్తు ప్రకారం మనం పాటించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఎంతో ఆనందంగా ఉండొచ్చు. ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. వాస్తు ప్రకారం సంపద, శ్రేయస్సు పెరగాలంటే వీటిని కచ్చితంగా పాటించాలి. ఈ వాస్తు నియమాలను కనుక పాటించిన‌ట్లయితే సంపద పెరుగుతుంది. విజయాలని అందుకుంటారు. చాలామంది వాస్తు ప్రకారం ఇంట్లో సంపద శ్రేయస్సుని ఎలా రెట్టింపు చేసుకోవాలని చూస్తూ ఉంటారు.

ఉత్తర దిశ.. సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంది. ఈ దిశ కుబేరుడిని ఆహ్వానిస్తుంది. ఆర్థిక పత్రాలు, విలువైన వస్తువులని ఈ దిశలో పెట్టడం వలన సంపద వస్తుంది. తూర్పుదిక్కుకి అభిముఖంగా పని చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కొచ్చు. ఆర్థిక బాధలని తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో వాటర్ ఫౌంటెన్ ని కానీ, చేపల తొట్టెని కానీ పెట్టండి.

Vastu Tips For Wealth must follow them for good results
Vastu Tips For Wealth

వీటిని పెట్టడం వలన ఆర్థిక బాధల నుండి గట్టెక్కొచ్చు. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. సంపదని ఇవి ఆకర్షిస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇంటికి మంచి శక్తిని, అదృష్టాన్ని తీసుకురావాలంటే కిటికీలని లోపలికి తెరవాలి. సంపదని ఇవి ఇంటికి తీసుకువస్తాయి. ఇల్లు ఎప్పుడూ కూడా మురికిగా ఉండకూడదు.

ఇల్లు మురికిగా వున్నా, శుభ్రంగా లేకపోయినా ప్రతికూల శక్తి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీని అస్సలు ఇల్లు ఆకర్షించలేదు. సంపద ఉండదు. నెగటివ్ ఎనర్జీ మాత్రమే ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి. కాబట్టి కచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి. డబ్బులకి సంబంధించిన వాటిని, లాకర్ వంటి వాటిని ఈశాన్యం వైపు పెట్టుకోండి. సంపద రెట్టింపు అవుతుంది. ఇలా మీరు వాస్తు ప్రకారం వీటిని పాటించినట్లయితే ఎంతో సంతోషంగా ఉండొచ్చు. సంపద పెరుగుతుంది. బాధలు ఏమీ కూడా ఉండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now