Vastu Tips For Income : ఉద్యోగం లేదా వ్యాపారం.. ఆదాయం పెరిగి సంప‌ద రావాలంటే.. ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..!

December 12, 2023 11:58 AM

Vastu Tips For Income : చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం నడుచుకోవడం వలన, ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండొచ్చు. అయితే, కొంతమంది ఎంత సంపాదించినా కూడా ఒక రూపాయి చేతిలో నిలవదు. ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు. ఆర్థిక సమస్యల్లో కూరుకు పోతుంటారు. అయితే, జీతం పెరిగి, ఆదాయం రెట్టింపు అవ్వాలని అనుకునేవారు ఈ వాస్తు చిట్కాలను పాటించడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆదాయం రెట్టింపు అవుతుంది. మరి ఇందుకోసం ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఉద్యోగులు వారికి నచ్చిన రంగంలో ఎదగడానికి, ప్రమోషన్లు పొందడానికి, ఈ వాస్తు చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. కెరీర్ బాగుండాలంటే పక్షులకి ఆహారం, నీళ్లు అందించాలి. ఆకాశంలో ఎగిరే పక్షుల్లో దేవతలు ఉంటారు. అందుకే పక్షులకి ఆహారం నీళ్లు ఇస్తే మంచిది. దేవతలు ఆశీస్సులు లభిస్తాయి.

Vastu Tips For Income follow these to get rid of economical problems
Vastu Tips For Income

అలానే, వీధి కుక్కలకి ఆహారం పెడితే ఎంతో పుణ్యం వస్తుంది. రోడ్డు మీద తిరిగే ఆవులకి కూడా ఆహారాన్ని పెట్టండి. ఉద్యోగంలో వృద్ధి లభిస్తుంది. ఇంట్లో పెద్దల్ని దేవతలతో పోలుస్తారు. ఏదైనా పండుగ సమయంలో కాని శుభకార్యాలప్పుడు కానీ, ఇంట్లో తల్లిదండ్రులకి పెద్దలకి నమస్కరించాలి అని హిందూ సంప్రదాయం చెబుతోంది.  అలానే, పని చేసే ప్రాంతంలో పచ్చని చెట్లు ఉండేలా చూడండి.

డెస్క్ మీద మనం చిన్న పాటి మొక్క ఉన్న కుండీని కూడా పెట్టుకోవచ్చు. మొక్కలు పాజిటివ్ ఎనర్జీని తీసుకు వస్తాయి. వీటిని పెడితే, మూడ్ కూడా బాగుంటుంది. ఈ మొక్కలకు ముళ్లు మాత్రం లేకుండా చూడండి. పని చేసే టేబుల్ కింద డస్ట్ బిన్ వంటివి పెట్టద్దు. టేబుల్ పక్కన, డెస్క్ పక్కన డస్ట్ బిన్ ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఒకవేళ టేబుల్ కింద డస్ట్ బిన్ ని కచ్చితంగా ఉంచాలంటే, ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ ఉండదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now