Rudraksha : రుద్రాక్ష ధారణ వల్ల పలు లాభాలు కలుగుతాయి. వీటిని శివ స్వరూపాలుగా భావిస్తారు. సాక్షాత్తు శివుడి అశ్రువులు భూమిమీద పడి రుద్రాక్షలుగా ఆవిర్భవించాయని పురాణోక్తి. అటువంటి రుద్రాక్షలు 21 రకాలు. అయితే ఎవరు ఏ రుద్రాక్షను ధరించాలి అనేది ప్రధాన సమస్య. దీనికి పండితులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్కో జన్మనక్షత్రం ఉంటుంది. వారి వారి జన్మనక్షత్రాల ప్రకారం రుద్రాక్షలను ధరించాల్సి ఉంటుంది. ఇక ఎవరెవరు ఏయే రుద్రాక్షలను ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అశ్వని నవముఖి, భరణి షణ్ముఖి, కృత్తిక ఏకముఖి, ద్వాదశముఖి, రోహిణి ద్విముఖి, మృగశిర త్రిముఖి, ఆరుద్ర అష్టముఖి, పునర్వసు పంచముఖి, పుష్యమి సప్తముఖి, ఆశ్లేష చతుర్ముఖి, మఖ నవముఖి, పుబ్బ షణ్ముఖి, ఉత్తర ఏకముఖి, ద్వాదశముఖి, హస్త ద్విముఖి, చిత్త త్రిముఖి, స్వాతి అష్టముఖి, విశాఖ పంచముఖి, అనురాధ సప్తముఖి, జ్యేష్ఠ చతుర్ముఖి, మూల నవముఖి, పూర్వాషాఢ షణ్ముఖి, ఉత్తరాషాఢ ఏకముఖి లేదా ద్వాదశముఖి, శ్రవణం ద్విముఖి, ధనిష్ట త్రిముఖి, శతభిషం అష్టముఖి, పూర్వాభాద్ర పంచముఖి, ఉత్తరాభాద్ర సప్తముఖి, రేవతి చతుర్ముఖి.. ఇలా ఆయా నక్షత్రాలు ఉన్నవారు ఆయా రుద్రాక్షలను ధరించాల్సి ఉంటుంది.
అయితే వీటితోపాటు ఆయా కామ్యాలు నెరవేరడానికి అంటే కోరికలు, సంకల్పాలు నెరవేరడానికి కొన్ని కాం బినేషన్లలలో రుద్రాక్షలను ధరించాలని పండితులు పేర్కొంటున్నారు. విద్య కావాలనుకున్నవారు చతుర్ముఖి, ఆరోగ్యం కోసం షణ్ముఖి, గ్రహబాధలు పోవడానికి నవముఖి తదితర రుద్రాక్షలను ధరించాలి. అయితే వాటి వివరాలను పండితులు, జ్యోతిష నిపుణుల సూచనలతో ధరిస్తే మంచిది. దీంతో అనుకున్న ఫలితాలు వస్తాయి. అంతా మంచే జరుగుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…