Processed Foods : చిప్స్, పిజ్జాలు, బర్గర్లు, ఐస్‌క్రీములు, ఇతర బేకరీ పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఎక్కువగా లాగించేస్తున్నారా ? అయితే ఆగండి. ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే ఇకపై మీరు ఆ పదార్థాలను తినాలంటేనే జంకుతారు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే.. ఆ పదార్థాలను తినడం వల్ల త్వరగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. సాక్షాత్తూ సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైన నిజం.
కొందరు సైంటిస్టులు జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్‌ను తినడం వల్ల కలుగుతున్న అనర్థాలతోపాటు ఆ ఫుడ్‌ను తినడం వల్ల ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడుతున్నారు, ఏ వయస్సులో చనిపోతున్నారు.. అనే విషయాలను తెలుసుకునేందుకు 2 ఏళ్ల పాటు అమెరికా, యూరప్‌లలోని 44,551 మందిని పర్యవేక్షించారు. నిత్యం వారు తీసుకునే ఆహారం, ఇతర అలవాట్లు, నిద్రపోయే సమయం, వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తదితర వివరాలను రికార్డు చేశారు. ఈ క్రమంలో సైంటిస్టులకు తెలిసిందేమిటంటే జంక్ ఫుడ్స్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఎక్కువగా తినే వారు త్వరగా చనిపోతారని తేల్చారు. ఆ ఫుడ్ తినని వారితో పోలిస్తే తినే వారు త్వరగా చనిపోయే అవకాశాలు 14 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని నిర్దారించారు.
కాగా సైంటిస్టులు చేపట్టిన పై అధ్యయనాన్ని జామా ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. సైంటిస్టులు తమ పరిశోధనకు ఎంచుకున్న వారిలో పెద్దలే అధికంగా ఉన్నారు. ఇక అమెరికాలో ప్రాసెస్డ్, జంక్ ఫుడ్‌ను తింటున్న వారి శాతం 61 ఉండగా, కెనడాలో అది 62 శాతంగా ఉంది. అలాగే యూకేలో 63 శాతం మంది తమ డైట్‌లో ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఇలా ప్రాసెస్డ్, జంక్ ఫుడ్‌ను అధికంగా తింటే.. క్యాన్సర్ లేదా గుండె జబ్బుల బారిన పడి త్వరగా చనిపోతారని, కనుక డైట్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందేనని, వీలైనంత వరకు ఇంట్లో వండుకున్న ఆహారాన్ని తినడమే ఉత్తమమని సైంటిస్టులు సూచిస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…