వాస్తు టిప్‌: నీటితో నింపిన మ‌ట్టి కుండ‌ను ఈ దిశ‌లో ఉంచితే.. ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

May 8, 2021 1:49 PM

చాలా మందికి ఎప్పుడూ ఏవో స‌మ‌స్య‌లు ఉంటుంటాయి. ఆర్థిక స‌మ‌స్య‌లు, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తోపాటు ఏ ప‌ని చేసినా కొంద‌రికి క‌ల‌సి రాదు. దీంతో వారు ఎప్పుడూ తీవ్ర ఆందోళ‌న చెందుతుంటారు. అయితే కింద తెలిపిన వాస్తు టిప్‌ను పాటించ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

put earthen pot filled with water in this direction in house see what happens

ఇంట్లో మ‌ట్టి కుండ‌ను ఏ దిశ‌లో పెడితే శుభం క‌లుగుతుందో వాస్తు శాస్త్ర పండితులు ఆచార్య ఇందు ప్ర‌కాష్ వివ‌రించారు. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఉత్త‌ర దిశ‌లో నీటితో నింపిన మ‌ట్టి కుండ‌ను పెట్టాలి. దీంతో శుభం క‌లుగుతుంది.

ఉత్త‌ర దిశ‌లో నీటితో నింపిన మ‌ట్టి కుండ‌ను ఉంచ‌డం వ‌ల్ల వ‌రుణ దేవుడి ఆశీర్వాదాలు ల‌భిస్తాయి. ఇంట్లోని అంద‌రిపై వ‌రుణ దేవుడి క‌టాక్షం క‌లుగుతుంది. ఇంట్లో అంద‌రికీ ఉండే భ‌యాలు, అసౌక‌ర్యాలు తొల‌గిపోతాయి. ఇంట్లో ముగ్గురు పిల్ల‌లు ఉంటే వారిలో మ‌ధ్య వ‌య‌స్కుల‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ఇంట్లో ఉన్న అంద‌రికీ అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now