జ్యోతిష్యం & వాస్తు

Pooja Room Vastu Tips : పూజ గ‌ది విష‌యంలో ఈ వాస్తు నియ‌మాల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి.. లేదంటే అరిష్టం క‌లుగుతుంది..!

Pooja Room Vastu Tips : హిందువులు దేవ‌త‌ల‌ను, దేవుళ్ల‌ను గుళ్లల్లోనే కాకుండా ఇంటిలో పూజ గ‌దిని నిర్మించుకుని మ‌రీ పూజిస్తూ ఉంటారు. ఇంటి పూజ గ‌దిలో కుల దేవ‌త‌ల‌ను, వారికి న‌చ్చిన దేవ‌తా, దేవుడి ఫోటోల‌ను ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇది మ‌న‌సుకు ప్ర‌శాంత‌త‌ను క‌లిగించ‌డంతో పాటు జీవితంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నాన్ని కూడా క‌లిగిస్తుంది. అయితే ఎన్ని ప్ర‌త్యేక పూజ‌లు చేసిన ఎంత ఆరాధించిన కొంద‌రు ఎప్ప‌టికి మ‌న‌సును ప్ర‌శాంతంగా ఉంచులేక‌పోతారు. అలాగే వారి జీవితంలో ఒక దాని త‌రువాత ఒక‌టి స‌మ‌స్య వ‌స్తూనే ఉంటుంది. ఇంట్లో ఉండే పూజ గ‌ది నిర్మాణంలో ఉన్న వాస్తు దోషాలు కూడా ఈ స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతాయ‌ని పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్రంలో పూజ గ‌ది లేదా ఇంట్లో గుడి నిర్మించడానికి కొన్నినియ‌మాలు ఉన్నాయి.

ఈ నియమాల‌ను పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. ఇంట్లో అశాంతి, ధ‌న‌న‌ష్టంతో పాటు ప్ర‌శాంత‌త కూడా దెబ్బ‌తింటుంది. ఇంట్లో ఉండే పూజ గ‌ది విష‌యంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గ‌దిలో ఒక‌టి కంటే ఎక్కువ శంఖాలు పెట్ట‌కూడ‌దు. చాలా మంది తెలిసి తెలియ‌క లేదా అలంక‌ర‌ణ ప్రాయంగా చిన్న పెద్ద శంఖువుల‌ను ఉంచుతూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదు. క‌నుక ఇంట్లో పూజ గ‌దిలో ఒక్క శంఖువును మాత్ర‌మే ఉంచాలి. అలాగే చాలా మంది ఇంట్లో పూజ గ‌దిలో మ‌ర‌ణించిన పెద్ద‌ల ఫోటోలు, త‌ల్లిదండ్రుల ఫోటోల‌ను ఉంచుతారు. కానీ ఇలా చేయ‌కూడ‌దు. మ‌ర‌ణించిన వారి ఫోటోల‌ను పూజ గ‌దిలో ఉంచితే ఇంట్లో క‌ష్టాలు వ‌స్తాయి.

Pooja Room Vastu Tips

మ‌ర‌ణించిన వారి ఫోటోల‌ను ఇంటికి ద‌క్షిణ దిశ‌లో ఉంచాలి. అలాగే పూజ గ‌దిలో విరిగిన విగ్ర‌హాల‌ను లేదా ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి విగ్ర‌హాల‌ను, ఫోటోల‌ను ఉంచ‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వ‌స్తాయి. అలాగే పూజ గ‌దిలో అస్థ‌వ్య‌స్థంగా లేదా చెడు స్థితిలో ఉన్న దేవుడి ఫోటోల‌ను ఉంచ‌కూడ‌దు. ఇది ఇంట్లో ప్ర‌తికూల‌త‌ను తెస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే వ్య‌క్తుల పురోగ‌తి కూడా దెబ్బ‌తింటుంది. అలాగే ప్ర‌తిరోజూ పూజ గ‌దిని శుభ్రం చేసుకోవాలి. దేవుడికి స‌మ‌ర్పించిన పూల‌ను మ‌రుస‌టి తొల‌గించాలి. అలాగే పూజ సామాగ్రిని కూడా దేవుడి ఫోటోల ద‌గ్గ‌ర ఉంచ‌కూడ‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM