Pigeon In Home : పావురాలు ఇంట్లో గూడు కడితే.. శుభమా.. అశుభమా..?

January 4, 2024 2:18 PM

Pigeon In Home : చాలామందికి, అనేక సందేహాలు ఉంటాయి. వాస్తు ప్రకారం ఏం చేస్తే మంచిది..? ఏం చేయకూడదు అనేది అడిగి తెలుసుకుంటూ ఉంటారు. పండితులు, ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలు ని చెప్పారు. వీటిని, చూసి, ఆచరిస్తే మనకి కూడా మంచి జరుగుతుంది. అయితే, కొంతమంది ఇళ్లల్లో పావురాలు గూడు కడుతూ ఉంటాయి. అయితే, వీళ్లకు సందేహం ఉంటుంది. పావురాలు ఇంట్లో గూడు కడితే మంచిదా..? కాదా..? పావురాలు ఇంట్లో గూడు కట్టడం వలన, ఎటువంటి ఫలితం ఉంటుంది అని. అప్పుడప్పుడు మనం గార్డెన్ లో వాటిలో పావురాలు తిరగడానికి చూస్తూ ఉంటాము.

పావురాలు రావడానికి చిన్న రంధ్రం వున్నా, అందులో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. పావురాలు ఇంట్లోకి రావడానికి, కొంతమంది శుభం గా భావిస్తారు. కొంతమంది మాత్రం అశుభంగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం, పావురాలు ఇంట్లోకి రాకూడదని చెప్తూ ఉంటారు. పావురాలు లక్ష్మీదేవికి భక్తులు. పావురం ఆనందం, శాంతికి చిహ్నం. పావురం ఇంట్లోకి రావడం అనేది సంతోషాన్ని, శాంతిని, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అయితే, పావురం ఇంట్లో గూడు పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు.

Pigeon In Home is it ok according to vastu
Pigeon In Home

పావురాలు ఇంట్లో గూడు కడితే, ఆర్థిక సమస్యలు వస్తాయి. అలానే ఇతర సమస్యలు కూడా వస్తాయట. అందుకే పావురాన్ని ఇంట్లో గూడు పెట్టుకుని, ఇవ్వకుండా చూసుకోండి. పావురం ఇంట్లో గూడు కట్టుకోవడం వలన, కీడు జరుగుతుంది. పావురం ఇంట్లో కాని ఇంటి బాల్కనీ లేదంటే ఎక్కడైనా గూడు కట్టుకుంటే, సమస్యలు రాబోతున్నాయని దానికి అర్థం. మనశ్శాంతి ఉండదు.

ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు జరుగుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. పావురాలు గూడు కట్టుకుని, అందులో గుడ్లు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదు. అలా చేస్తే, నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పావురం గుడ్లు పెడితే, అవి పిల్లలుగా మారి అవి వెళ్లిపోయే వరకు ఆగాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now