Lord Kubera : లక్ష్మీ దేవితో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా పొందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా సంపదకు దేవుడిగా పరిగణిస్తారు. కుబేరుడి ఆశీస్సులు ఉంటే మనం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తీరతాయి. మనం ఆర్థికంగా బలంగా తయారవుతాము. అదే విధంగా ఒకవేళ కుబేరుడి ఆగ్రహానికి గురైతే మనం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, కుబేరుడి అనుగ్రహం మన మీద ఉండాలన్నా మనం స్నానం చేసే నీటిలో వీటిని వేసుకోవాలని జోతిష్య శాస్త్రం చెబుతుంది. నీటిలో ఈ ప్రత్యేకమైన వాటిని వేసుకుని స్నానం చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉంటుందని ఆర్థికంగా బలంగా తయారవుతామని పండితులు చెబుతున్నారు.
స్నానం చేసే నీటిలో వేటిని వేసుకోవడం వల్ల మనం కుబేరుడి అనుగ్రహాన్ని పొందగలుగుతామో.. ఇప్పుడు తెలుసుకుందాం. జోతిష్య శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో ఉప్పును వేసుకోవాలి. వారానికి రెండు రోజులు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మంగళవారం, శనివారాల్లో స్నానం చేసుకునే నీటిలో ఉప్పు వేసుకుని చేయడం వల్ల లక్ష్మీ దేవితో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఇలా 6 నెలల పాటు చేయడం వల్ల మనం సానుకూల ఫలితాలను చూడవచ్చు. అలాగే సోమవారం నాడు నీటిలోమ పాలు కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇళ్లు ఎప్పుడూ సంపదలతో కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా నయం అవుతాయి. ఇక శుక్రవారం నాడు నీటిలో ఏదైనా పరిమళాన్ని కలిపి స్నానం చేయాలి.
ఇలా చేయడం వల్ల కుబేరుడి దయ వల్ల జీవితంలో పురోగతి వస్తుంది. సంపదలకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే గురువారం నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చని జోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇలా చేయడం వల్ల జాతకంలో గరు గ్రహం బలపడుతుంది. ఇలా 3 నెలల పాటు చేయడం వల్ల సంపద పెరగడం ప్రారంభమవుతుంది. అలాగే శనివారం నాడు నీటిలో ఉప్పు మరియు పసుపు కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుబేరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…