Horoscope : ఏప్రిల్ 13 త‌రువాత ఈ 5 రాశుల వాళ్ల‌కు తిరుగే ఉండ‌దు.. సిరి సంప‌ద‌లు క‌లుగుతాయి..!

April 1, 2024 8:53 AM

Horoscope : జోతిష్య శాస్త్రంలో గ్ర‌హాల కద‌లిక‌ల‌ను చాలా ముఖ్య‌మైన‌విగా ప‌రిగ‌ణిస్తారు. ప్ర‌తి గ్ర‌హం యొక్క క‌ద‌లిక‌లు అన్ని రాశుల వారిపై ప్ర‌భావాన్ని చూపిస్తాయి. కొంత మందికి ఈ క‌ద‌లిక‌లు మంచి ఫ‌లితాల‌ను ఇస్తే మ‌రికొంద‌రికి ఇవి ప్ర‌తికూలమైన ఫ‌లితాల‌ను ఇస్తాయి. జోతిష్య శాస్త్ర ప్ర‌కారం ఏప్రిల్ 13న సూర్యుడు మేష సంక్ర‌మ‌ణం చెంద‌బోతున్నాడు. దీంతో ఏప్రిల్ 13 త‌రువాత ఈ 5 రాశుల వారికి మంచి రోజులు రానునాయ‌ని జోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ 13 త‌రువాత మేలు జ‌రిగే 5 రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుని సంక్ర‌మ‌ణం వల్ల మేష‌రాశి వారికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఉద్యోగ‌స్తుల‌కు ఇది ఎంతో మంచి కాలం అని చెప్ప‌వ‌చ్చు. అలాగే వారికి ప్ర‌మోష‌న్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉంటాయి. వ్యాపార‌స్తుల‌కు కూడా లాభాలు చేకూరుతాయి. కుటుంబ జీవితం మెరుగుప‌డుతుంది.

త‌ల్లిదండ్రుల‌తో గ‌డిపే సమ‌యం దొరుకుతుంది. అలాగే వైవాహిక జీవితంలో ఉండే స‌మ‌స్య‌లు కూడా తొలుగుతాయి. అలాగే సూర్యుని సంక్ర‌మ‌ణం వ‌ల్ల వృష‌భ రాశి వారికి కూడా శుభ ఫ‌లితాలు క‌లుగుతాయి. ఆర్థికంగా లాభాలు పెరుగుతాయి. శ్రామికుల‌కు జీతాలు పెరిగే అవ‌కాశం ఉంది. ఆర్థికంగా మెరుగైన ఫ‌లితాలు ఉన్నాయి. కుటుంబంతో బంధాలు మెరుగుప‌డుతాయి. వృష‌భ రాశి వారు నూత‌న ప‌నులు మొద‌లు పెట్ట‌డానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. క‌ర్కాట‌క రాశి వారికి కూడా ఏప్రిల్ 13 త‌రువాత మంచి కాలం వ‌స్తుంది. ఉద్యోగస్తుల‌కు ఇది చాలా మంచి కాలం. ప్ర‌మోష‌న్ వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. స‌మాజంలో గౌర‌వం పెరుగుతుంది. కుటుంబంతో చ‌క్క‌టి స‌మ‌యాన్ని గడుపుతారు. అలాగే చేస్తున్న ప‌నుల్లో ఆటంకాలు తొల‌గిపోయి విజ‌యాలు చేకూరుతాయి. అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు.

Horoscope these 5 zodiac sign persons lucky after april 13th
Horoscope

అలాగే సూర్యుని సంక్ర‌మ‌ణం వ‌ల్ల క‌న్యా రాశి వారికి కూడా మంచి రోజులు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద్యోగస్తులు వారు ప‌ని చేసే చోట గౌర‌వాన్ని పొందుతారు. వైవాహిక జీవితం కూడా మెరుగుప‌డుతుంది. దీర్ఘ‌కాలిక వ్యాధుల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే ఆర్థిక స్థితి కూడా మెరుగుప‌డుతుంది. కొత్త ఆదాయ మార్గాలు స‌మ‌కూరుతాయి. ఎక్కువ డ‌బ్బు సంపాదించే అవ‌కాశం ఉంటుంది. అయితే సంపాదించిన డ‌బ్బును ఖర్చు పెట్ట‌కుండా దాచుకోవ‌డం ముఖ్యం. అలాగే ధ‌న‌స్సు రాశి వారికి కూడా సూర్యుని సంక్ర‌మ‌ణం వ‌ల్ల మంచి రోజులు రానున్నాయి. ధ‌న‌స్సు రాశి వారు ఆర్థిక లాభాలు పొందే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్ప‌డ‌తాయి. అలాగే ఉద్యోగస్తుల‌కు కూడా ఇది మంచి కాలం అని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now