Dustbin In Home : ఇంట్లో చెత్త డబ్బాని ఈ దిక్కులో అస్సలు పెట్టకండి.. సమస్యలు వస్తాయి..!

December 5, 2023 1:39 PM

Dustbin In Home : వాస్తు ప్రకారం పాటించడం వలన, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు జీవితం పై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. వాస్తు ప్రకారం కనుక నడుచుకున్నట్లైతే, జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా మారుతుంది. కొన్ని పొరపాట్లు తెలియక చేస్తే కూడా, ప్రభావం ఎక్కువ పడుతుంది. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. వాటిని మనం, మనకు నచ్చినట్లుగా సర్దుతూ ఉంటాం. అలా కాకుండా, వాస్తు ప్రకారం పెట్టినట్లయితే, చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది.

ప్రతి ఇంట్లో చెత్తబుట్ట ఉంటుంది. చెత్త డబ్బా నుండి వెలువడే శక్తి, ఇంటి గమనాన్ని మార్చేస్తుంది, వాస్తు ప్రకారం, చెత్త డబ్బాలని ఇష్టం వచ్చిన చోట పెట్టకూడదు. ప్రతికూల శక్తులు ఇంట్లోకి వచ్చి, సమస్యల్ని కలిగిస్తాయని వాస్తు చెప్తోంది. పిల్లలు చదువుకునే గదిలో అసలు చెత్త డబ్బా ని పెట్టకండి. చదువు మీద ఆసక్తి బాగా తగ్గిపోతుంది. అలానే, బెడ్రూంలో కూడా చెత్త డబ్బాని పెట్టొద్దు. దీనివలన సంబంధాలు దెబ్బతింటాయి.

Dustbin In Home put it according to vastu
Dustbin In Home

ప్రశాంతత ఉండదు. ఈశాన్యం దిశలో డస్ట్ బిన్ ఉంచడం వలన, మానసిక సమస్యలు కలుగుతాయి. లక్ష్యాలని చేరుకోవడానికి కూడా అవ్వదు. తూర్పు వైపు పెడితే కీర్తి ప్రతిష్టలు పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆగ్నేయం వైపు చెత్త డబ్బాని పెడితే, ఇంటికి సంపద రాకుండా అది అడ్డుకుంటుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి, చెత్త డబ్బా పెట్టేటప్పుడు, అసలు ఈ పొరపాటు చేయకండి. ఇలా కనుక చేసినట్లయితే, కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి, చెత్త డబ్బా పెట్టేటప్పుడు వీటిపై దృష్టి పెట్టి, ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. అప్పుడు సమస్యలు ఉండవు సంతోషంగా ఉండొచ్చు. కానీ ఈ పొరపాట్లు చేసినట్లయితే కచ్చితంగా కష్టాలు తప్పవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now