W-L Meaning : మనం రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కిటికీ లోంచి బయటకు చూస్తే ఆ ట్రాక్ పక్కన బోర్డులకు అనేక రకాల రాతలతో కొన్ని సింబల్స్ ఉంటాయి. అవి ఎందుకు పెడతారో మనలో చాలా మందికి తెలియదు. కానీ వాటికి కూడా కొన్ని ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. భారతీయ రైల్వే దీన్ని ట్రాక్ ల పై ఉన్నటువంటి క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేస్తుంది. ఆ క్రాసింగ్ పక్కన ఒక బోర్డు ఉంటుంది. దానిపై W/L అని రాసి ఉంచుతారు. ఇందులో W/L అంటే విజిల్ లెవెల్ బోర్డ్ అని అర్థం వస్తుంది. ఇది రైల్వే ట్రాక్ కు రెండు వైపులా ఉంటుంది.
భారత రైల్వే అధికారిక వెబ్ సైట్ లో చూస్తే లోకో పైలెట్ లను అప్రమత్తం చేయడం కోసమే ఈ బోర్డును ఏర్పాటు చేస్తుంది రైల్వే శాఖ. ఇది క్రాసింగ్ రెండువైపులా అమర్చబడి ఉంటుంది. దీని దాటడానికి 600 మీటర్ల ముందే ఈ బోర్డు ఏర్పాటు చేస్తారు. దీనిగుండా రైల్వే పైలెట్ వెళ్తున్నప్పుడు హారన్ ఇవ్వడం తప్పనిసరి. ఆ బోర్డు దాటేవరకూ నిరంతరంగా హారన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం క్రాసింగ్ వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే ఆ రైలు వస్తున్నట్టు హారన్ మోగించడం. అందుకే W/L బోర్డును ఏర్పాటు చేస్తారు.
ఇక ఆ పసుపు రంగు బోర్డుపై W/L అని నలుపు రంగు తో రాయబడి ఉంటుంది. ఇలా ఈ కలర్ ను వాడడం వల్ల చాలా దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. అలా దూరం నుంచి కనిపించినప్పుడు లోకో పైలట్ హారన్ ను కొట్టడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దీని ప్రధానార్థం. ఈ బోర్డును ఏర్పాటు చేయడంలో రైల్వేశాఖ అనేక నిబంధనలు పెట్టింది. ఇది నేల నుండి 2100 మిల్లీ మీటర్ల ఎత్తులో ఉండాలి.. 2 బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఒకటి ఇంగ్లీషు. రెండవది హిందీలో రాసి ఉంటుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…