ప్రస్తుతం మనం వాడుతున్న అనేక రకాల ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. కల్తీకి కాదేదీ అనర్హం.. అన్నట్లు అన్ని పదార్థాలను కల్తీ చేస్తున్నారు. అయితే కల్తీ పదార్ధాల వల్ల వ్యాపారులకు పెద్ద మొత్తంలో లాభం కలుగుతుంది, కానీ మనకు మాత్రం నష్టం కలుగుతుంది. అలాంటి పదార్థాలను తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి.
మనం నిత్యం వాడే పదార్థాల్లో ఉప్పు ఒకటి. మార్కెట్‌లో కల్తీ అయిన ఉప్పును కూడా విక్రయిస్తున్నారు. మనం తినే ఉప్పులో కచ్చితంగా అయోడిన్ ఉండాలి. అయోడిన్ ఉప్పును వాడడం వల్ల శరీర పెరుగుదల సరిగ్గా ఉంటుంది. ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. మెదడు అభివృద్ధి చెందుతుంది. కానీ అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం మనం తినే ఉప్పులో నిర్దిష్ట మోతాదులో అయోడిన్ ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటి నుంచో ఈ విధానాన్ని పాటిస్తున్నారు.
ఇక నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ చెబుతున్న ప్రకారం మనం వాడే ఉప్పులో అయోడిన్ శాతం 15 పీపీఎంకు మించి ఉండాలి. కొన్ని రకాల కంపెనీల్లో అయోడిన్ 30 పీపీఎం వరకు ఉంటుంది. దాన్ని డబుల్ ఫోర్టిఫైడ్ ఉప్పు అంటారు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం అయోడిన్ ఉప్పును విక్రయించడం లేదు. కల్తీ అయిన ఉప్పును విక్రయిస్తున్నాయి. ఈ క్రమంలోనే అలాంటి ఉప్పును తింటున్న చాలా మంది అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
ఇక కల్తీ అయిన ఉప్పును, అసలు ఉప్పును తెలుసుకోవడం చాలా సులభమే. అందుకు గాను ఆలుగడ్డలతో కింద తెలిపిన టెస్ట్ చేయాలి.
ముందుగా ఒక ఆలుగడ్డను తీసుకోవాలి. దాన్ని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయాలి. ఒక్కో ముక్కపై ఉప్పు రాయాలి. ఒక నిమిషం పాటు ఉండాలి. తరువాత ఒక్కో ముక్కపై కొన్ని చుక్కల నిమ్మరసం పిండాలి. అనంతరం వేచి చూస్తే ఆలుగడ్డ ముక్క పై భాగం రంగు మారుతుంది. అదే జరిగితే ఆ ఉప్పు కల్తీ అయిందని తెలుసుకోవాలి. కల్తీ అయిన ఉప్పు అయితే ఆలుగడ్డ ముక్క పై భాగం నీలి రంగులోకి మారుతుంది. అదే అయోడిన్ ఉన్న అసలైన ఉప్పు అయితే ఆలుగడ్డ ముక్క రంగు మారదు. ఈ విధంగా కల్తీ అయిన ఉప్పును, అసలు ఉప్పును సులభంగా గుర్తించవచ్చు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పైన తెలిపిన టెస్ట్‌కు చెందిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దాన్ని చూస్తే విషయం మరింతగా అర్థం అవుతుంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…