LPG Gas Cylinder Rules : ప్రస్తుత తరుణంలో చాలా మంది వంట గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు అందుబాటులో ఉండేలా నూతన పథకాలను అందజేస్తున్నారు. దీంతో వంట గ్యాస్ వినియోగం పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతం వంట గ్యాస్ వినియోగదారుల సంఖ్య 14.45 కోట్లు ఉండగా, ఇందులో 10 కోట్ల మందికి పైగా సబ్సిడీని పొందుతున్నారు. అలాగే మహిళలు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు. అయితే ఇకపై వంట గ్యాస్ సిలిండర్‌ల విషయంలో నిబంధనలను మార్చనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేందుకే ఈ నిబంధనలను అమలు చేయనున్నట్లు సమాచారం.
ఇకపై వంట గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేయాలంటే అందుకు గాను వినియోగదారుడు తన ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ బయోమెట్రిక్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు గాను ముందుగా వినియోగదారుడు తనకు ఉన్న సిలిండర్‌కు చెందిన గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత నుంచి బయోమెట్రిక్ వేసి సిలిండర్‌ను బుక్ చేయాలి. అయితే ఈ నిబంధన వల్ల అక్రమాలను అడ్డుకోవచ్చని, కేంద్రం ఇచ్చే లబ్ధి నేరుగా లబ్ధిదారులకు చేరుతుందని అంటున్నారు. అయితే ఇది ప్రస్తుతం ఉన్న వినియోగదారులకా లేక కొత్త వినియోగదారులకా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
కాగా మరోవైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వంట గ్యాస్ సిలిండర్‌పై క్రమంగా సబ్సిడీని తగ్గిస్తూ వస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులకు కంపెనీని బట్టి కేవలం రూ.30 నుంచి రూ.50 వరకు మాత్రమే సిలిండర్‌పై సబ్సిడీని అందిస్తున్నారు. ఇక త్వరలోనూ దాన్ని కూడా ఎత్తేస్తారని సమాచారం. ఆ తరువాత పేదలకు మరిన్ని ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తారని తెలుస్తోంది. అయితే కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తేనే ఇలా జరుగుతుందని, యూపీఏ వస్తే నిబంధనలను మరోలా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…