Google Pay Personal Loan : ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది కొన్ని సార్లు సతమతం అవుతుంటారు. సరైన టైముకు డబ్బులు అందకపోవడమో లేక ఆదాయానికి మించి ఖర్చులు అవడమో జరిగే సరికి చాలా మందికి ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం లోన్ యాప్‌లలో లోన్ తీసుకోవడం అంటే చాలా మంది జంకుతున్నారు. అధిక మొత్తంలో వడ్డీని ముక్కు పిండి వసూలు చేయడంతోపాటు ఒక నెల కాస్త ఆలస్యం అయితే చాలు వేధించుకు తింటారు. కానీ ఆర్‌బీఐ దగ్గర రిజిస్టర్ అయి ఉన్న లోన్ సంస్థల ద్వారా అప్పు తీసుకుంటే ఈ బాధలు కాస్త తప్పుతాయి. అయితే ఇలాంటి బాధలు లేకుండా సాఫీగా లోన్ అందించేందుకు గూగుల్ నడుం బిగించింది. అందుకు గాను తన గూగుల్ పే యాప్ ద్వారా కస్టమర్లకు గరిష్టంగా రూ.9 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని అందిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ పే ద్వారా ఎవరైనా సరే రూ.10వేల నుంచి రూ.9 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. అందుకు గాను గూగుల్ ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి కస్టమర్లకు లోన్లను అందిస్తోంది. ఇక గూగుల్ పే ద్వారా రుణం పొందేందుకు కింది స్టెప్స్‌ను అనుసరించాలి.
ముందుగా గూగుల్ పే యాప్‌లోకి వెళ్లి అందులో కిందకు వస్తే గెట్ లోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై టచ్ చేశాక మరో విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు లోన్ వివరాలు కనిపిస్తాయి. మీరు అందులో రూ.9 లక్షల వరకు లోన్ పొందవచ్చు. కనీసం రూ.10వేలు అయినా ఇస్తారు. ఇక నెలకు రూ.1000 ఈఎంఐ నుంచి ప్రారంభం అవుతుంది. మీరు తీసుకునే రుణం మొత్తాన్ని బట్టి ఈఎంఐ మారుతుంది. ఇక లోన్ కాలవ్యవధి కనిష్టంగా 6 నెలలు మొదలుకొని గరిష్టంగా 4 ఏళ్ల వరకు పెట్టుకోవచ్చు.
లోన్ వడ్డీ రేటు విషయానికి వస్తే 13.99 నుంచి వడ్డీ విధిస్తారు. మీరు లోన్ ఆప్షన్‌పై టచ్ చేశాక అందులో మీ వివరాలను నింపాలి. పేరు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్, చిరునామా, మీరు వ్యాపారం లేదా ఉద్యోగం ఏం చేస్తున్నారు, ఆదాయం ఎంత, పాన్ తదితర వివరాలను నమోదు చేయాలి. దీంతో మీరు లోన్ పొందేందుకు అర్హులా కాదా అన్న వివరాలు తెరపై కనిపిస్తాయి. తరువాత మీరు అర్హులు అయితే ఎంత మొత్తం లోన్ శాంక్షన్ అయింది చెబుతారు అక్కడ లోన్ మొత్తం, ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ, ఈఎంఐ తదితర వివరాలు కనిపిస్తాయి. మీకు లోన్ మొత్తం నచ్చితే తీసుకోవచ్చు. అలాగే మీకు కావల్సిన ఈఎంఐ పెట్టుకోవచ్చు. దీంతో మీకు లోన్ లభిస్తుంది. ఇలా మీరు గూగుల్ పే యాప్ నుంచి పర్సనల్ లోన్ పొందవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…